Brahmanandam
Bramhanandam : హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. దాదాపు 1260కు పైగా సినిమాల్లో కమెడియన్ గా నటించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించున్నారు. ఇటీవల కాలంలో ఆయన సినిమాలు చేయడం చాలా తగ్గించేశారు. చాలా సెలెక్టివ్‌గా, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్నారు. ప్రత్యేకంగా బ్రహ్మానందం కోసం ఓ సీన్ క్రియేట్ చేసిన డైరెక్టర్లు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇక చాలాకాలం తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన పెద్ద కుమారుడు గౌతమ్ రాజాతో కలిసి ‘బ్రహ్మ ఆనందం’ అనే సినిమాలో ఆయన నటించారు. అయితే తండ్రీ కొడుకులు ఈ సినిమాలో తాత మనవడిగా నటించడం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొన్నారు బ్రహ్మానందం. అందులో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు బ్రహ్మానందం. తన స్నేహితుడు, కమెడియన్ ఎంఎస్ నారాయణ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. నేను సంపాదించిన సంపద నమ్మకం.. ఒక వ్యక్తికి తన చనిపోతున్న సమయంలో ఎన్నో ఆలోచనలు బ్రెయిన్ లో తిరుగుతూ ఉంటాయి. ఆయనకు ఎంతోమంది తెలుసు.. ఎన్నో పరిచయాలు కూడా ఉన్నాయి. తల్లి, తండ్రి, రక్త సంబంధాలు, స్నేహితులు ఇలా అనేక బంధాలు ఉన్నాయి.
కానీ అలాంటి సమయంలో ఒక వ్యక్తిని చూడాలని అనిపించడం.. ఆ వ్యక్తిని ఎలాగైనా కలుసుకోవాలని కోరుకోవడం.. నోటితో తన కోరికను చెప్పలేక.. మాట్లాడలేని పరిస్థితిలో.. ఏం చేయాలో తెలియక.. పక్కనే ఉన్న తన కూతురికి సైగ చేసి.. తన కూతురితో తెల్ల కాగితం మీద.. నేను బ్రహ్మానందం అన్నను ఇప్పుడే చూడాలని రాసి ఇచ్చాడట. అది చదివి అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఎక్కడో శంషాబాద్ దగ్గర సినిమా షూటింగ్లో ఉన్న నేను.. దర్శకుడు దగ్గరకు వెళ్లి.. తాను అడిగిన విషయం చెబితే ఏమంటారో అనే భయం వేసి, ఆ తర్వాత అలాగే కారు ఎక్కి వెళ్ళిపోయానని తెలిపారు.
: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. దాదాపు 1260కు పైగా సినిమాల్లో కమెడియన్ గా నటించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించున్నారు. ఇటీవల కాలంలో ఆయన సినిమాలు చేయడం చాలా తగ్గించేశారు. చాలా సెలెక్టివ్‌గా, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్నారు. ప్రత్యేకంగా బ్రహ్మానందం కోసం ఓ సీన్ క్రియేట్ చేసిన డైరెక్టర్లు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇక చాలాకాలం తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన పెద్ద కుమారుడు గౌతమ్ రాజాతో కలిసి ‘బ్రహ్మ ఆనందం’ అనే సినిమాలో ఆయన నటించారు. అయితే తండ్రీ కొడుకులు ఈ సినిమాలో తాత మనవడిగా నటించడం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొన్నారు బ్రహ్మానందం. అందులో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు బ్రహ్మానందం. తన స్నేహితుడు, కమెడియన్ ఎంఎస్ నారాయణ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. నేను సంపాదించిన సంపద నమ్మకం.. ఒక వ్యక్తికి తన చనిపోతున్న సమయంలో ఎన్నో ఆలోచనలు బ్రెయిన్ లో తిరుగుతూ ఉంటాయి. ఆయనకు ఎంతోమంది తెలుసు.. ఎన్నో పరిచయాలు కూడా ఉన్నాయి. తల్లి, తండ్రి, రక్త సంబంధాలు, స్నేహితులు ఇలా అనేక బంధాలు ఉన్నాయి.
కానీ అలాంటి సమయంలో ఒక వ్యక్తిని చూడాలని అనిపించడం.. ఆ వ్యక్తిని ఎలాగైనా కలుసుకోవాలని కోరుకోవడం.. నోటితో తన కోరికను చెప్పలేక.. మాట్లాడలేని పరిస్థితిలో.. ఏం చేయాలో తెలియక.. పక్కనే ఉన్న తన కూతురికి సైగ చేసి.. తన కూతురితో తెల్ల కాగితం మీద.. నేను బ్రహ్మానందం అన్నను ఇప్పుడే చూడాలని రాసి ఇచ్చాడట. అది చదివి అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఎక్కడో శంషాబాద్ దగ్గర సినిమా షూటింగ్లో ఉన్న నేను.. దర్శకుడు దగ్గరకు వెళ్లి.. తాను అడిగిన విషయం చెబితే ఏమంటారో అనే భయం వేసి, ఆ తర్వాత అలాగే కారు ఎక్కి వెళ్ళిపోయానని తెలిపారు.
అక్కడి నుంచి ఎంఎస్ నారాయణను చూడడానికి వెళ్లగానే బెడ్డు పై నుంచి నన్ను చూసి రెండు కళ్లల్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను ఎప్పటికీ ఆ ఘటనను మర్చిపోలేనన్నారు. నన్ను చూస్తూ నా చేయి పట్టుకుని అక్కడే ప్రాణాలు వదిలాడు. చూస్తుండగానే ప్రాణాలు వదలడం చూసి ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నానని బ్రహ్మానందం తెలిపారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన నా రక్తసంబంధం కాదు.. కానీ అదే ఒక హ్యూమన్ రిలేషన్. అంతటి మేధావి అంత తక్కువ వయసులోనే వెళ్లిపోతాడని నేను అనుకోలేదంటూ బ్రహ్మానందం ఎమోషనల్ అయ్యాడు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: No matter what the cost is to save the doctors even if it is emotional brahmanandam
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com