Ram Charan : మెగా ఫ్యామిలీ తమ అదృష్ట దేవత భావించే రామ్ చరణ్(Ram Charan) కూతురు క్లిన్ కారా(Klin Kaara) ముఖాన్ని చూడడం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కానీ రామ్ చరణ్ మాత్రం ఆమె ముఖం మీడియా కి కనపడకుండా ఇన్ని రోజులు జాగ్రత్తగా దాచుకుంటూ వచ్చాడు. అన్ స్టాపబుల్ షో కి వెళ్ళినప్పుడు బాలయ్య బాబు మా అందరికీ క్లిన్ కారా ఫోటో ఎప్పుడు చూపిస్తావు అని అడగగా, ఒక సెలబ్రిటీ కొడుకుగా నేను ఎంతో స్వేచ్చని కోల్పోయాను, నా బిడ్డకు అలాంటి పరిస్థితి రానివ్వకూడదు అని అనుకున్నాను, అందుకే ఆమె ముఖాన్ని దాచేసాను అంటూ చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉంది కదా, సెలబ్రిటీ కొడుకు/కూతురు అంటే అందరి పిల్లలకు దొరికే స్వేచ్ఛ దొరకడం కష్టమే, ప్రతీ దాంట్లోనూ స్పెషల్ గా చూస్తారు, అదే అందరితో పాటు ఉండే స్వేచ్ఛ ఉంటే బాల్యం చూడాల్సినవన్నీ చూస్తారు.
అయితే రామ్ చరణ్ నిన్న విమానాశ్రయం లో లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు తన కూతురు తో కలిసి ఉన్నటువంటి వీడియో సోషల్ మీడియా లో లీక్ అయిపోయింది. ఇంతకాలం కష్టపడి సీక్రెట్ మైంటైన్ చేసేందుకు ఆయన పడిన కష్టాలన్నీ వృధా అయిపోయింది. చూసేందుకు చాలా క్యూట్ గా ఉంది, అచ్చు గుద్దినట్టు నాన్న పోలికలే అంటూ ఈ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాప పుట్టినప్పటి నుండి మెగా ఫ్యామిలీ లో అందరూ మరో లెవెల్ ని చూసారు. చిరంజీవి కి పద్మవిభూషణ్ తో పాటు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఘనత వచ్చింది, అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు, రామ్ చరణ్ కి ఆస్కార్ అవార్డ్స్ లో గుర్తింపు, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించి ఉపముఖ్యమంత్రి అవ్వడమే కాకుండా, నేషనల్ లెవెల్ లో రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగడం వంటివి జరిగాయి.
అంతే కాకుండా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి కూడా ఈ చిన్నారి కుటుంబంలోకి అడుగుపెట్టినప్పుడే జరిగింది. నిహారిక కొణిదెల నిర్మాతగా సక్సెస్ అయ్యింది, త్వరలో నాగబాబు ఆంధ్ర ప్రదేశ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. అయితే మెగా ఫ్యామిలీ సాధిస్తున్న ఘటనలు చూసి దిష్టి ఎక్కువగా పెట్టినట్టినట్టు ఉన్నారు. అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వాలి వచ్చింది, రామ్ చరణ్ కి ‘గేమ్ చేంజర్’ రూపం లో డిజాస్టర్ ఫ్లాప్ తగిలింది. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తన కెరీర్ లో మరో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని బలమైన నమ్మకంతో ఉన్నాడు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత ఆయన సెట్ చేసుకుంటున్న కాంబినేషన్స్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఊపేసే రేంజ్ లో ఉన్నాయి.
Mega princess ❤️#RamCharan daughter #Klinkara pic.twitter.com/LD32nWTccy
— Filmy Bowl (@FilmyBowl) February 14, 2025