WPL 2024: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ జట్టు.. ప్రీమియర్ లీగ్ లో మరోసారి మెరిసింది. ఈ టోర్నీలో వరుసగా రెండవ విజయాన్ని సొంతం చేసుకుంది. బెంగళూరు వేదికగా మంగళవారం రాత్రి గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు అని రంగాల్లో రాణించి విజయాన్ని సొంతం చేసుకుంది. గుజరాత్ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.
మృతి మందాన (27 బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో ) 43 పరుగులు చేసింది. సబ్బినేని మేఘన (28 బంతుల్లో ఐదు ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో) 36 పరుగులు చేసింది. సోఫీ మోలినాక్స్(3/25), రేణుక సింగ్ (2/14) బౌలింగ్ లో అద్భుతమైన ప్రతిభ చూపారు. విధంగా గుజరాత్ జట్టు 107 పరుగులే చేసింది. 20 ఓవర్లూ ఆడినప్పటికీ.. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. గుజరాత్ జట్టులో హేమలత (25 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్) 31 నాటౌట్ గా నిలిచింది. ఆ జట్టులో ఈమె చేసిన స్కోరే అత్యధికం. హర్లీన్ డియోల్(31 బంతుల్లో మూడు ఫోర్లతో) 22 పరుగులు చేసింది.. మిగతా వారెవరూ రాణించలేదు. పైగా బెంగళూరు బౌలర్లకు దాసోహం అయ్యారు.. బెంగళూరు బౌలర్లలో సోఫీ మూడు వికెట్లు తీసి గుజరాత్ జట్టు పతనాన్ని శాసించింది. రేణుక సింగ్ రెండు వికెట్లు తీసి సత్తా చాటింది. జార్జియో వేర్హం ఒక వికెట్ దక్కించుకుంది.
ఈ ఇన్నింగ్స్ మొత్తానికి బ్యాటింగ్ హైలెట్ గా నిలిచింది. గుజరాత్ బౌలర్ల ను ఆమె ఒక ఆట ఆడుకుంది. ఆమె దూకుడు బ్యాటింగ్ ఫలితంగా బెంగళూరు జట్టు 12.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 110 పరుగులు చేసి.. గెలుపును నల్లేరు మీద నడక చేసుకుంది. స్మృతి ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టుకు బలమైన పునాదులు వేసింది. ఆమెకు ఎదురైన తొలి నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు కొట్టింది. డివైన్(6) నిరాశపరచినప్పటికీ..వన్ డౌన్ బ్యాటర్ మేఘనతో కలిసి గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడి చేసింది. ఈ దశలో స్మృతి హాఫ్ సెంచరీకి చేరువైంది. ఈ నేపథ్యంలో తనూజ రిటర్న్ క్యాచ్ తో హాఫ్ సెంచరీ కలలను కల్లలు చేసింది. స్మృతి అవుట్ అయినప్పటికీ ఎల్లి ఫెర్రీ 23 పరుగులు చేసింది. మేఘనతో కలిసి మిగతా లాంఛనం పూర్తి చేసింది. గుజరాత్ జట్టు బౌలర్లలో గార్డెనర్, తనూజ చెరో వికెట్ సాధించారు. కాగా బెంగళూరు బ్యాటింగ్ చేస్తున్నంత సేపు “స్మృతి స్మృతి” అంటూ అభిమానులు చేసిన నినాదాలతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది.