https://oktelugu.com/

Gaganyaan Mission: 40 సంవత్సరాల తర్వాత అంతరిక్షంలోకి భారతీయులు… మోడీ కామెంట్స్ వైరల్

సూర్యుడు, చంద్రుడి తోనే ఇస్రో ఆగడం లేదు. తాజాగా చేపట్టబోయే ప్రాజెక్టుకు గగన్ యాన్ అని పేరు పెట్టింది. ఈ ప్రాజెక్టు నేపథ్యంలో 40 సంవత్సరాల తర్వాత భారతీయ వ్యోమగాములు అంతరిక్షంలో అడుగుపెడతారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 28, 2024 / 08:55 AM IST
    Follow us on

    Gaganyaan Mission: చంద్రుడి మీద, సూర్యుడి మీద ఇస్రో ప్రయోగాలు చేస్తోంది. పెద్ద పెద్ద దేశాలకు సాధ్యం కాని ఘనతలు సాధిస్తోంది. అలాంటి ఇస్రో.. మరో ఘన చరిత్ర లిఖించేందుకు సిద్ధమైంది. 40 సంవత్సరాల తర్వాత అంతరిక్షంలో మూడు రంగుల జెండాను ఎగరవేసేందుకు సమాయత్తమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇస్రో ఏర్పాట్లు మొత్తం పూర్తి చేసింది. గత ఏడాది చేపట్టిన ప్రయోగం ద్వారా చంద్రుడి మీద నీటి ఆనవాళ్లు ఉన్నాయని ఇస్రో కనుగొంది. చంద్రుడి ఉపరితల వాతావరణంలో హీలియం నిల్వలు కూడా ఉన్నాయని ప్రకటించింది. సూర్యుడికి సంబంధించి కూడా ప్రయోగాలు చేస్తోంది. సూర్యుడి మీదకు గత ఏడాది చివరిలో శాటి లైట్ ను పంపింది. సూర్యుడి వద్ద ఉన్న వాతావరణం, అక్కడి పరిస్థితులపై అది అధ్యయనం చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి ఫలితాలు రావడానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది.

    సూర్యుడు, చంద్రుడి తోనే ఇస్రో ఆగడం లేదు. తాజాగా చేపట్టబోయే ప్రాజెక్టుకు గగన్ యాన్ అని పేరు పెట్టింది. ఈ ప్రాజెక్టు నేపథ్యంలో 40 సంవత్సరాల తర్వాత భారతీయ వ్యోమగాములు అంతరిక్షంలో అడుగుపెడతారు. ఈ మిషన్ లో వ్యోమగాములను ప్రత్యేకమైన రాకెట్ల ద్వారా భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి తీసుకెళ్తారు. మూడు రోజులపాటు వారు అక్కడే ఉంటారు. అక్కడి వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తారు. ముఖ్యంగా అక్కడి ధూళి, అందులో ఉన్న పదార్థాలను పరీక్షిస్తారు. అనంతరం వారు తిరిగి భూమి మీదకు వస్తారు. ఇందులో పాల్గొనే వ్యోమగాములు సురక్షితంగా తిరిగి సముద్రంలో దిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఈ మిషన్ లో పాల్గొనే వ్యోమగాముల పేర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు.. గ్రూప్ కెప్టెన్లు బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ ఎస్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్తారని మోడీ వివరించారు. వారితో కొద్దిసేపు మాట్లాడి, అభినందనలు తెలియజేశారు. “వ్యోమగాములు 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నారు. వారు నాలుగు శక్తులని” ప్రధాని పేర్కొన్నారు. నలుగురు వ్యోమగాములతో మాట్లాడిన తర్వాత తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో గగన్ ప్రాజెక్టు పురోగతిని ప్రధానమంత్రి పరిశీలించారు.. అనంతరం ఇస్రో చైర్మన్ సోమనాథ్ ను సత్కరించారు. ” అంతరిక్ష రంగంలో భారత్ తిరుగులేని పురోగతి సాధిస్తోంది. పెద్దపెద్ద దేశాలకు సాధ్యం కాని ఘనతను లిఖిస్తోంది.. చంద్రయాన్, గగన్ యాన్ లో మహిళలకు పెద్దపీట వేస్తోంది. వారు లేకుంటే ఇవి సాధ్యమయ్యేది కావు. ఇస్రో లిఖిస్తున్న కీలక ఘట్టాలు మన దేశ భవిష్యత్తును మరింత ఉజ్వలంగా మార్చుతున్నాయని” నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.