RCB Vs RR IPL 2025: పోనీ ఆ జట్టు చేతులెత్తేస్తోందా? బౌలింగ్ అధ్వానంగా చేసి ప్రత్యర్థి ఆటగాళ్లకు దాసోహం అవుతుందా? బ్యాటింగ్ సరిగ్గా చేయలేక తలవంచుతోందా? అంటే ఈ ప్రశ్నలకు నో అనే సమాధానమే వస్తోంది. కానీ కీలక దశలో ఆ జట్టు ఒత్తిడిని ఎదుర్కొని తలవంచుతోంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు మ్యాచ్లలో విజయం దాకా వచ్చి తలవంచింది. ప్రత్యర్థి జట్టు పన్నిన ఉచ్చులో చిక్కుకొని విలవిలాడింది. గెలుపుకు దగ్గరలో ఉండి కూడా ఓడిపోవడంతో రాజస్థాన్ జట్టుపై ఆగ్రహానికి మించి సానుభూతి వ్యక్తం అవుతోంది. గురువారం జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టుపై రాజస్థాన్ ఓడిపోవడం సగటు అభిమానిని ఆవేదనకు గురిచేస్తోంది. అసలు జట్టు ఇలా ఎందుకు ఆడుతోందనే బాధను కలిగిస్తోంది. ఒకానొక దశలో చేజింగ్ లో బెంగళూరును మించిపోయిన రాజస్థాన్.. చివరి రెండు ఓవర్లలో తీవ్ర ఒత్తిడికి గురైంది. క్రమంగా వికెట్లు కోల్పోయి 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక్కడ బెంగళూరు గెలిచింది అనేదానికంటే.. రాజస్థాన్ చేతులారా ఓడిపోయిందనడం సబబు. బ్యాటింగ్ బాగా చేసి.. బౌలింగ్లో కూడా సత్తా చాటి.. చివరికి గెలుపుకి దగ్గర్లో ఉన్నప్పుడు ఓడిపోవడం రాజస్థాన్ జట్టుకు ఇటీవల పరిపాటిగా మారింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు మ్యాచ్లలో రాజస్థాన్ ఇలానే ఓడిపోవడం ఆ జట్టు అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది..
Also Read: బిసిసిఐ నిర్ణయంతో.. పాకిస్తాన్ క్రికెట్ మరింత మట్టి కొట్టుకుపోవడం ఖాయం
అప్పట్లో దక్షిణాఫ్రికా
ఇప్పుడు ఐపీఎల్ లో రాజస్థాన్ ఎలా అయితే గెలుపు ముందు బోల్తా పడుతుందో.. దక్షిణాఫ్రికా కూడా ఐసీసీ నిర్వహించిన మెగా టోర్నీలలో అలాగే బోల్తా పడింది. ఒకటి కాదు రెండు కాదు లెక్కకు మిక్కిలి టోర్నీలలో దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది. దీంతో క్రికెట్లో అత్యంత దురదృష్టకరమైన జట్టుగా దక్షిణాఫ్రికా పేరుపొందింది. 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ లోనూ దక్షిణాఫ్రికాను దురదృష్టమే వెంటాడింది. ఫైనల్ మ్యాచ్లో విజయానికి దగ్గరగా వచ్చిన ఆ జట్టు.. ఒత్తిడిలో చేతులెత్తేసింది. చివరికి ఓటమిపాలైంది. కప్ సాధించుకునే క్రమంలో ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన ఆ జట్టు.. చివరి ఓవర్లలో తడపడింది. చివరికి ఓటమిని ఎదుర్కొంది.. ఐపీఎల్ లో రాజస్థాన్ పరిస్థితి కూడా అలానే ఉంది. మొదట్లో వరుస విజయాలు సాధించి ఊపు మీద ఉన్న ఆ జట్టు.. ఆ తర్వాత వరుసగా విఫలమవుతోంది. గెలుపు ముందు బోల్తాపడుతూ అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేస్తోంది.. బ్యాటింగ్ బాగున్నప్పటికీ.. ఓపెనర్లు బలంగా ఆడుతున్నప్పటికీ.. రాజస్థాన్ జట్టు మిడిల్ ఆర్డర్ విఫలం అవుతున్నది. ఒత్తిడికి తట్టుకోలేక తలవంచుతోంది. తద్వారా ఊహించని ఓటములు రాజస్థాన్ జట్టుతో ఎదురవుతున్నాయి . ఫలితంగా రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టమయ్యాయి.
Also Read: సునీల్ గవాస్కర్ సార్.. ఈ వయసులో మైదానంలో ఇదేం పని!