Sunil Gavaskar: మైదానాల దాకా వెళ్ళలేని వారు.. అంత ఖర్చు పెట్టి మ్యాచ్ లు చూడలేని వారు.. టీవీలకు అతుక్కుపోతున్నారు..స్మార్ట్ ఫోన్ ల నుంచి కళ్ళు కదపలేకపోతున్నారు. మొత్తంగా ఐపీఎల్ లో కొన్ని మినహా మిగతా మ్యాచ్ లు రంజుగా సాగుతున్నాయి. చివరి వరకు ఇరు జట్లు విజయాల కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో.. ఉత్కంఠ తారస్థాయికి చేరుతోంది. దీంతో అభిమానులకు సీట్ ఎడ్జ్ వినోదం లభిస్తోంది. చీర్ లీడర్స్ డ్యాన్సులు.. వ్యాఖ్యాతల మాటలు.. చంపక్ హంగామా.. వంటివి ఐపీఎల్ పోటీలకు సరికొత్త అందాన్ని తీసుకొస్తున్నాయి. అందువల్లే ఐపీఎల్ ప్రపంచ క్రికెట్ లీగ్లలో అత్యున్నతంగా నిలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రిచ్ క్రికెట్ లీగ్ గా అవతరించింది. అందువల్లే ఈ క్రికెట్ లీగ్ లో ఆడేందుకు ప్రపంచ దేశాల ప్లేయర్లు ఆసక్తి చూపిస్తున్నారు. చివరికి వాళ్ళ జాతీయ జట్టులో కూడా ఆడేందుకు విముఖత చూపిస్తూ.. భారత్ వస్తున్నారు. దండిగా సంపాదించడమే కాకుండా.. ఇక్కడి ప్రజల ఆధార అభిమానులు కూడా పొందుతున్నారు.. ఇక 2008లో మొదలైన ఈ టోర్నీ.. దిగ్విజయంగా 17 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 18 వ ఎడిషన్ కొనసాగుతోంది.
Also Read: బిసిసిఐ నిర్ణయంతో.. పాకిస్తాన్ క్రికెట్ మరింత మట్టి కొట్టుకుపోవడం ఖాయం
వయసును మర్చిపోయి..
ఐపీఎల్ లో ఆటగాళ్లు మాత్రమే కాదు.. మాజీ ఆటగాళ్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆటగాళ్లు మైదానంలో ఆడుతుంటే.. మాజీ ఆటగాళ్లు మైదానం వెనుక వ్యాఖ్యానం.. ఇతర వ్యవహారాలు సాగిస్తున్నారు. అయితే ఈ జాబితాలో సునీల్ గవాస్కర్ ముందు వరుసలో ఉంటాడు. వ్యాఖ్యాతగా.. విశ్లేషకుడిగా అతడు బహుళ గుర్తింపు పొందాడు. ఏ విషయమైనా సరే కుండబద్దలు కొట్టినట్టు చెప్పగల నేర్పు సునీల్ గవాస్కర్ సొంతం. కొన్ని సందర్భాల్లో సునీల్ గా గవాస్కర్ పై విమర్శలు వచ్చినప్పటికీ.. ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడు. వెనక్కి తగ్గే అవకాశం కూడా లేదు. అయితే ప్రస్తుతం సీజన్లో ఐపిఎల్ నిర్వాహక కమిటీ చంపక్ అని రోబోను ప్రవేశపెట్టింది. ఇది వైడ్ యాంగిల్ లో ఫోటోలు తీస్తుంది. దృశ్యాలను చిత్రీకరిస్తుంది. ఐపీఎల్ నిర్వాక కమిటీకి కావలసినంత పుటేజ్ అందిస్తుంది. అయితే ఇది మైదానంలో రకరకాల విన్యాసాలు చేస్తుంది. రోబోటిక్ మిషన్ కావడంతో.. ప్లేయర్లకు కూడా కావలసినంత వినోదం లభిస్తుంది. రిమోట్ ద్వారా దీన్ని ఆపరేట్ చేస్తుంటారు. అయితే గురువారం రాజస్థాన్, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చంపక్ రకరకాల విన్యాసాలు చేసింది. ముఖ్యంగా సునీల్ గవాస్కర్ చెప్పినట్టు చేసింది. అతడు ఎగిరినట్టు ఎగిరింది. 75 సంవత్సరాల వయసులోనూ సునీల్ గవాస్కర్ మైదానంలో ఉత్సాహంగా కనిపించారు. అంతేకాదు చంపక్ కు తన ఆట పాటలతో విశ్రాంతి లేకుండా చేశారు.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది.. ఈ వీడియోని చూసిన చాలామంది.. సునీల్ గవాస్కర్ సార్..మీ వయసెంత.. మైదానంలో మీరు చేస్తున్న పని ఏంటి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
SUNNY G GOT MOVES AT 75 AGE.
Sunil Gavaskar playing with Champak. pic.twitter.com/IVwcoPWOv1
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2025