IND Vs PAK: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం అనేక అగచాట్లు పడిన తర్వాత.. చివరికి కిందా మీదా పడి నిర్వహించింది. కాకపోతే ఆ టోర్నీలో ఆడేందుకు బీసీసీఐ ఒప్పుకోలేదు. భద్రతా కారణాలను చూపించి తమ జట్టును అక్కడికి పంపించేది లేదని స్పష్టం చేసింది. దీంతో ఛాంపియన్ ట్రోఫీని భారత్ తటస్థ వేదికగా ఆడాల్సి వచ్చింది. భారత్ తో తలపడేందుకు పాకిస్తాన్ కూడా ఆ తటస్థ వేదిక వద్దకు వెళ్లాల్సి వచ్చింది. అదే అప్పట్లో భారత్ తమ దేశంలోకి రాకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నీతి మాటలు మాట్లాడింది. ఆదేశ మాజీ క్రికెటర్లతో రకరకాల ప్రకటనలు చేయించింది. చివరికి ఐసిసిని బెదిరించే ప్రయత్నం చేసింది. బీసీసీఐ గట్టిగా తలుచుకోవడంతో పాకిస్తాన్ పప్పులు ఉడకలేదు. అప్పట్లో మన దేశానికి చెందిన కొంతమంది రాజకీయ నాయకులు క్రీడలకు, రాజకీయాలకు సంబంధం పెడతారా అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఇప్పుడు పహిల్గామ్ ఘటన తర్వాత వారి నోర్లు ఒక్కసారిగా మూతపడ్డాయి.. బిసిసిఐ భారత జట్టును చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు ఎందుకు పంపించలేదో అప్పుడు గాని వారికి అవగతం కాలేదు.
Also Read: ఇషాన్ కిషన్ అవుట్ కాదా? మరి ఎందుకు వెళ్లిపోయినట్టు?
పాకిస్తాన్ క్రికెట్ మట్టి కొట్టుకుపోవడం ఖాయం
ఆదాయం పరంగా చూసుకున్నా.. ఆదరణ పరంగా చూసుకున్నా.. పాకిస్తాన్ తో పోల్చి చూస్తే.. భారత్ కొన్ని కోట్ల రెట్లు పై స్థానంలో ఉంటుంది. అందువల్లే ప్రపంచ క్రికెట్ మీద భారత్ పెత్తనం సాగుతోంది. ఐసీసీకి వచ్చే ఆదాయంలో మెజారిటీ వాటా భారత్ వల్లే సాధ్యమవుతున్నది. చివరికి పాకిస్తాన్ కూడా భారత్ దయాదాక్షిణ్యాల మీదే బతుకుతోంది. భారత్ – పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడక పుష్కరం దాటిపోయింది. ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. పహిల్గామ్ ఘటన నేపథ్యంలో ఇకపై భవిష్యత్ కాలంలో కూడా రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక టోర్నీలు ఉండవని బీసీసీఐ స్పష్టం చేసింది.. ఈ నిర్ణయం వల్ల బిసిసిఐ కి ఎటువంటి నష్టం ఉండదు. కానీ అసలే అవసాన దశలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ మరింత మట్టి కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత్ వెళ్లకపోవడంతో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు యాడ్ రెవెన్యూ అంతంతమాత్రం గానే వచ్చింది. చెత్త ప్రదర్శన ద్వారా లీగ్ దశలోనే పాకిస్తాన్ ఇంటికి వెళ్లిపోయింది. భారత్ ఫైనల్ వెళ్లడంతో దుబాయ్ లోనే ఆ మ్యాచ్ నిర్వహించాల్సి వచ్చింది. మొత్తంగా అటు ఆదాయాన్ని.. ఇటు పరువును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోల్పోయింది. ఇప్పుడు భారత్ క్రికెట్ బోర్డు మరింత కఠిన నిర్ణయం తీసుకోవడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు కు వచ్చే రోజులన్నీ మరింత దుర్భరం కానున్నాయి.
Also Read: 28 మంది చనిపోతే ఒక్క వాక్యంలో ముగించిన పాక్ క్రికెటర్..