KCR: రాజకీయాలు ఎలాగైనా చేయొచ్చు. రాజకీయ నాయకులు ఎలాగైనా మాట్లాడొచ్చు. కానీ అధికారంలో ఉన్నవారు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నాలుక మీద కాస్త పట్టు కలిగి ఉండాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే సమస్యలు ఎదురవుతాయి. ఆ తర్వాత వాటికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పైగా ఇప్పుడు అసలే సోషల్ మీడియా రోజులు.. మాట్లాడిన ప్రతి మాట రికార్డేడే. అందుకే రాజకీయాలు చేసేవారు.. ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. కాస్త హుందాతనాన్ని ప్రదర్శించాలి. అలా కాకుండా మేమతే.. అలాగే ఉంటామంతే.. అని అంటే మాత్రం తేడా వచ్చేస్తుంది.
Also Read: భారత్ వర్సెస్ పాక్ : ‘ఆపరేషన్ ఆక్రమణ్’తో వాయుసేన రె‘ఢీ’
పాకిస్తాన్ దేశాన్నే..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన మాటలకు అడ్డు అదుపు ఉండేది కాదు.. చివరికి దేశ ప్రధానిని సైతం ఆయన లెక్క చేసేవారు కాదు. లెక్కలో పెట్టేవారు కాదు. నరేంద్ర మోడీతో సఖ్యత ఉన్నన్నాళ్లు కెసిఆర్ ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు. పైగా అత్యంత అవినీతి రహిత ప్రధానమంత్రి అంటూ నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేవారు. సమయం దొరికితే చాలు విపరీతంగా ప్రశంసలు కురిపించేవారు. కానీ ఎప్పుడైతే బిజెపి తెలంగాణలో అడుగు పెట్టిందో.. కెసిఆర్ కూతుర్ని ఓడించిందో.. అప్పటినుంచి కెసిఆర్ కక్ష కట్టారు. ఇంకేముంది నరేంద్ర మోడీకి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా చేశారు. రాష్ట్రంలో పర్యటించడానికి అనేకమార్లు వచ్చినప్పటికీ.. ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు కేసీఆర్. పైగా మంత్రులను పంపించి అవమానపరిచారు . ముందుగానే చెప్పుకున్నట్టు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కెసిఆర్ తనకు తానే దైవాం శసంభూతుడిగా అనుకునేవారు. చివరికి దేశ ప్రధాని కూడా లెక్క చేయకపోయేవారు. నిండు శాసనసభ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. చివరికి పాకిస్తాన్ విషయాన్ని కూడా ఆయన అత్యంత సులభంగా కొట్టి పారేశారు. పాకిస్తాన్ భౌగోళికంగా.. సైన్యం పరంగా మన దేశం కట్టే తక్కువ అని.. కాశ్మీర్లో నిత్యం రగడ జరుగుతోందని.. హింస చోటు చేసుకుంటున్నదని.. భారత్ తలచుకుంటే పాకిస్తాన్ పని క్షణంలో పూర్తవుతుందని కెసిఆర్ అప్పట్లో శాసనసభ సమావేశాల్లో పేర్కొన్నారు.
పాకిస్తాన్ నీ కొట్టడం నీతో కాకుంటే చెప్పు మోడీ తాత మావోడు దిగుతాడు pic.twitter.com/tIvjV01nKn
— SR (@SrGoud29) April 24, 2025
కానీ అసలు వాస్తవాన్ని ఆయన పక్కనపెట్టి.. కేంద్రం ఏమీ చేయడం లేదనే వ్యాఖ్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ కెసిఆర్ చెప్పినంత ఈజీ కాదు పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడం. ఎందుకంటే పాకిస్తాన్ చిన్న దేశం అయినప్పటికీ.. దానికి ఉగ్రవాదుల అండగా ఉంది. చూస్తే అది ఉగ్రవాదుల అడ్డా . అందువల్లే ఆ దేశం సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తుంది. పైగా అమెరికా, చైనా వంటి దేశాలు పాకిస్థాన్ కు తెర వెనుక సహకారం అందిస్తుంటాయి. అందువల్లే పాకిస్తాన్ అంతలా రెచ్చిపోతుంది. ఈ విషయం తెలిసి కూడా కేసీఆర్ ఆనాడు ఆ వ్యాఖ్యలు చేశారంటే.. దాని వెనుక ఉన్న అంతరంగాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. వాస్తవానికి రాజకీయాలు వేరు.. దేశ అంతర్గత సమస్యలు వేరు.. అయితే అంతర్గత సమస్యలలో కూడా రాజకీయాలు వెతుక్కునే వారిని ఏమనాలో.. వారిని ఎలా పిలవాలో కేసీఆరే సెలవియ్యాలి.
Also Read: స్మిత సబర్వాల్ పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆమెను అందుకే టార్గెట్ చేశారా?