RCB Vs PBKS Qualifier 1: అనుకున్నట్టుగానే ముల్లన్ పూర్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారింది. బెంగళూరు బౌలర్లు ఈ పిచ్ పై సత్తా చాటుతున్నారు. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ మరో మాటకు తావు లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు. పంజాబ్ బ్యాటర్లు ఇబ్బంది పడేవిధంగా బౌలింగ్ వేశారు. ఫలితంగా సొంత మైదానంలో పంజాబ్ జట్టు ఇబ్బంది పడక తప్పలేదు. సూపర్ ఫామ్ లో ఉన్న ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, జోస్ ఇంగ్లిస్, శ్రేయస్ అయ్యర్, నెహల్ వదేరా, శశాంక్ సింగ్ వంటి వారు దారుణంగా విఫలమయ్యారు. వాస్తవానికి వీరి నుంచి భారీ ఇన్నింగ్స్ ను పంజాబ్ జట్టు అంచనా వేసింది. కానీ కీలకమైన మ్యాచ్ లో వారు విఫలం కావడంతో పంజాబ్ జట్టుకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది.. పిచ్ సహకరిస్తున్న నేపథ్యంలో బెంగళూరు బౌలర్లు పండగ చేసుకున్నారు. బెంగళూరు బౌలర్లలో మూడు వికెట్లు పడగొట్టి సుయాస్ శర్మ పంజాబ్ పతనాన్ని శాసించాడు. హేజిల్ వుడ్, యష్ దయాల్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ సాధించాడు.
ఈ మ్యాచ్ లో అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడం ద్వారా బెంగళూరు బౌలర్ హేజిల్ వుడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత ఐపిఎల్ లో బెస్ట్ ఎకానమీ రేటింగ్ సాధించిన బౌలర్ గా నిలిచాడు. హేజిల్ వుడ్ 7.20 ఎకనామితో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఇతడి డాట్ పర్సంటేజ్ 55.8 గా ఉంది. భువనేశ్వర్ కుమార్ 8 శాతం ఎకనామి సాధించాడు. 8 వికెట్లు పడగొట్టాడు, ఇతడి డాట్ బాల్ పర్సెంటేజీ 50.0 గా ఉంది. అన్షుల్ కాంబోజ్ 8.04 ఎకనామి సాధించాడు.. 7 వికెట్లు పడగొట్టి, 43.6 డాట్ బాల్ పర్సంటేజ్ సాధించాడు. జోప్రా ఆర్చర్ 8.12 ఎకనామి సాధించాడు. 6 వికెట్లు పడగొట్టి, 50.00 డాట్ బాల్ పర్సంటేజీ సాధించాడు. అర్ష్ దీప్ సింగ్ 8.15 ఎకానమీ సాధించాడు. 8 వికెట్లు పడగొట్టి 50.6 డాట్ బాల్ పర్సంటేజ్ సాధించాడు.
అత్యంత కీలకమైన మ్యాచ్లో భారీగా పరుగులు చేయాల్సిన చోట పంజాబ్ బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో మైదానంలో నిరాశ జనకమైన వాతావరణం నెలకొంది. పంజాబ్ బ్యాటర్లు ఇలా వచ్చి అలా వస్తుండడంతో.. భారీ స్కోరు చేయలేకపోతోంది. దీనికి తోడు పిచ్ నుంచి సహకారం అద్భుతంగా లభిస్తున్న నేపథ్యంలో బెంగళూరు బౌలర్లు దుమ్ము రేపుతున్నారు. పంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. హోరాహోరిగా సాగుతుందనుకున్న మ్యాచ్ ఏకపక్షంగా మారడంతో.. ఊహించిన మజా రాకపోవడంతో ప్రేక్షకులు ఉసురుమంటున్నారు.