punjab kings vs royal challengers bengaluru match scorecard : ఐపీఎల్ 2025లోనే అత్యంత దూకుడుగా పకడ్బందీ బ్యాటింగ్ భీకర లైనప్ తో ఉన్న పంజాబ్ కింగ్స్ టీం సెమీస్ క్వాలిఫైయర్ లో చేతులెత్తేసింది. వరసగా వికెట్లు కోల్పోయి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఘోరంగా దెబ్బతిన్నది. 14.1 ఓవర్లలోనే 101 పరుగులకు పంజాబ్ చాపచట్టేసింది. ఆర్సీబీ దుమ్ములేపేసింది. ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్ వుడ్ 3 వికెట్లు, సూయాష్ శర్మ 3 వికెట్లు యష్ దయాల్ 2 వికెట్లతో వరుసగా వికెట్లు తీయడంతో పంజాబ్ చేతులెత్తేసింది. 5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఇక కోలుకోలేకపోయింది.
రెండో ఇన్నింగ్స్ లో ఆర్సీబీ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. మరి పంజాబ్ దీన్ని కాచుకుంటందా? ఆర్సీబీ గెలుస్తుందా? అన్నది వేచిచూడాలి.