RCB vs GT : వరుస విజయాలతో జోరు మీద ఉన్న బెంగుళూరు జట్టుకు గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) చుక్కలు చూపించింది. సొంత మైదానమైన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో దిమ్మతిరిగే దెబ్బను రుచి చూపించింది. హోరాహోరిగా సాగుతుందనుకున్న మ్యాచ్ ను వన్ సైడ్ చేసేసింది. అంతేకాదు ఈ సీజన్లో బెంగళూరుకు తొలి ఓటమిని రుచి చూపించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 168 పరుగులు చేసింది. బెంగళూరు విధించిన 169 పరుగుల టార్గెట్ ను గుజరాత్ టైటాన్స్ 17.5 ఓవర్లలోనే చేదించింది.. ఇక ఈ సీజన్లో గుజరాత్ జట్టుకు ఇది రెండవ విజయం. బెంగళూరుకు తొలి ఓటమి. ఈ ఓటమి ద్వారా బెంగళూరు అభిమానులు డీలా పడ్డారు. గుజరాత్ అభిమానులు అంతులేని ఉత్సాహాన్ని చూపించారు.
టాస్ గెలిచి..
గుజరాత్ టైటాన్స్ జట్టు శుభ్ మన్ గిల్ టాస్ గెలిచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు.. పిచ్ స్లో వికెట్ గా ఉన్నప్పటికీ బంతి బ్యాట్ మీదికి రాకపోవడంతో.. బెంగళూరు బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. షాట్ ఎంపికలో బెంగళూరు ఆటగాళ్లు విఫలం కావడంతో.. టికెట్లు వెంట వెంటనే పడేసుకున్నారు. బెంగళూరు ఆటగాళ్లలో లివింగ్ స్టోన్ (54) బాధ్యతాయుతంగా హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో బెంగళూరులు నిర్ణీత 20వ వార్లలో 8 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది.. బెంగళూరులో జితేష్ శర్మ (33), టిమ్ డేవిడ్ (32) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.. విరాట్ కోహ్లీ (7), దేవదత్ పడకల్ (4), సాల్ట్ (14), రజత్ పాటిదర్ (12) తీవ్రంగా నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. సాయి కిషోర్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అర్షద్ ఖాన్, ఇషాంత్, ప్రసిద్ధ్ ఒక్కో వికెట్ సొంతం చేసుకున్నారు..
Also Read : విరాట్ అవుట్ అయ్యాడని గుక్క పెట్టి ఏడ్చింది..
జిగేల్ మనిపించిన గుజరాత్
170 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన గుజరాత్ జట్టుకు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది.. గుజరాత్ కెప్టెన్ గిల్(14) స్వల్ప పరుగులకే అవుట్ అయ్యాడు..జాస్ బట్లర్(73) దూకుడుగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ మొత్తాన్ని గుజరాత్ వైపు మళ్ళించాడు. సాయి సుదర్శన్ (49) స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించాడు. వీరిద్దరూ మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పడంతో గుజరాత్ జట్టు విజయం వైపు ప్రయాణం చేసింది. బెంగళూరు ఓటమి వైపు వెళ్లిపోయింది. ఇక చివర్లో గుజరాత్ ఆటగాడు రూథర్ఫోర్డ్ (30) చెలరేగిపోయాడు. దీంతో గుజరాత్ బెంగళూరు విధించిన లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే పూర్తి చేసింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హజల్ వుడ్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. గుజరాత్ జట్టు ఈ సీజన్లో రెండవ విజయాన్ని సొంతం చేసుకోగా.. బెంగళూరు జట్టుకు తొలి ఓటమిని నమోదు చేసుకుంది. ప్రస్తుతం పాయింట్లు పట్టికలో గుజరాత్ నాలుగో స్థానంలో ఉంది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానానికి పడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ రెండవ స్థానం.. పంజాబ్ కింగ్స్ లెవెన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ జట్టు ఎనిమిదో స్థానానికి పడిపోయింది. గత సీజన్లో ఛాంపియన్ గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ చివరి స్థానంలో కొనసాగుతోంది.
Also Read : విరాట్ మందు కుప్పిగంతులా.. గ్రీన్ ఏడుపు ముఖం.. వైరల్ వీడియో