RCB vs GT : అభిమాన ఆటగాళ్లను భారతీయ ప్రేక్షకులు విపరీతంగా ఆరాధిస్తుంటారు. వారితో ఆటోగ్రాఫ్ తీసుకోవాలని.. సెల్ఫీ దిగాలని ఆరాటపడుతుంటారు. కొందరైతే అభిమాన ఆటగాళ్ల తో కరచాలనం.. ఆ లింగనం చేసుకునేందుకు దేనికైనా వెనుకాడరు.. చివరికి మైదానంలో ఉన్న సెక్యూరిటీని సైతం చేదించుకుని వెళ్తారు. ఇలాంటి సందర్భంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ వారు పెద్దగా లెక్కపెట్టరు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం తమ అభిమాన ఆటగాడు అవుట్ అయితే తట్టుకోలేరు. మైదానంలో అందరూ చూస్తుండగానే ఏడ్చేస్తారు. అలాంటి సంఘటనే బుధవారం చోటు చేసుకుంది.
Also Read : విరాట్ మందు కుప్పిగంతులా.. గ్రీన్ ఏడుపు ముఖం.. వైరల్ వీడియో
విరాట్ అవుట్ అయ్యాడని ఏడ్చింది
బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ (RCB vs GT) తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. బెంగళూరు జట్టులో లివింగ్ స్టోన్(54) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మహమ్మద్ సిరాజ్(3/19) మూడు వికెట్లు దక్కించుకున్నాడు.. ఈ మ్యాచ్లో బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (7) సింగిల్ డిజిట్ స్కోర్ కే అవుట్ అయ్యాడు.. అర్షద్ ఖాన్ బౌలింగ్లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. విరాట్ సొంత మైదానంలో అదరగొడతాడని.. గుజరాత్ జట్టు బౌలర్లను బెదరగొడతాడని బెంగళూరు అభిమానులు ఆశించారు. కానీ వాస్తవంలో అందుకు వ్యతిరేకంగా జరిగింది. కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి విరాట్ కోహ్లీ అవుట్ కావడంతో చిన్నస్వామి స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. చాలామంది అభిమానులు విరాట్ అవుట్ కావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అయితే ఓ మహిళ అభిమాని మాత్రం విరాట్ అవుట్ కావడంతో ఏడ్చేసింది. చిన్నపిల్లలాగా గుక్కపెట్టి అరిచింది..” విరాట్ అవుట్ అయ్యాడు. విరాట్ అవుట్ కాకూడదు. విరాట్ అవుట్ కావడాన్ని నేను జీర్ణించుకోలేనని” ఆ అమ్మాయి రోదిస్తూ వాపోయింది. ఆ అమ్మాయి ఏడ్చిన తీరును కెమెరామెన్ ప్రత్యేకంగా చూపించడంతో ఒక్కసారిగా మైదానంలో ఇతర ప్రేక్షకులు ఆమెను చూడటం మొదలుపెట్టారు. ఇటీవల చెన్నై జట్టు ఆటగాడు ధోని అవుట్ అయినప్పుడు కూడా ఓ మహిళ అభిమాని కూడా దాదాపు ఏడ్చినంత పని చేసింది. ఆమె కూడా ఒకసారిగా సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయింది. ఇక విరాట్ అవుట్ కావడంతో ఏడ్చేసిన మహిళను పదేపదే స్టేడియంలో కెమెరామెన్ చూపించడంతో.. ఆమె కూడా పాపులర్ పర్సన్ అయిపోయింది. అయితే ఈ మహిళా అభిమాని విరాట్ ఆడిన ప్రతి మ్యాచ్ మిస్ కాకుండా చూస్తుంది. బెంగళూరులో ఆడే ప్రతి మ్యాచ్ కు హాజరవుతుందని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read : ఆర్సీబీ చేజింగ్.. ప్రేక్షకులకు థ్రిల్లర్ మూవీని పరిచయం చేసింది