Viral Video : టి20 క్రికెట్ వెలుగులోకి వచ్చిన తర్వాత.. దానికి మరింత కమర్షియల్ హంగులు అద్దింది బీసీసీఐ(BCCI). ఇందులో భాగంగానే ఐపీఎల్ (Indian premier league)ను తెరపైకి తీసుకువచ్చింది.. ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ముంబై (Mumbai Indians), చెన్నై(Chennai super kings) జట్లు ఇప్పటివరకు చెరి ఐదు సార్లు విజేతలుగా నిలిచాయి. చెన్నై, ముంబై జట్లతో సమానమైన పేరును బెంగళూరు (royal challengers Bengaluru) జట్టు కలిగి ఉంది. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా కప్ దక్కించుకోలేకపోయింది. ” ఈ సాలా కప్ నమదే” అని అనుకోవడం.. ఆ తర్వాత కప్ కోల్పోయి నిరాశపడటం బెంగళూరు జట్టుకు అలవాటుగా మారింది. బెంగళూరు గత సీజన్లో అద్భుతంగా ఆడింది. కాకపోతే సెమీఫైనల్ లో ఓటమిపాలైంది. దీంతో సగటు బెంగళూరు అభిమాని ఢీలా పడిపోయాడు. ఇకపై బెంగుళూరు జట్టుకు ఎప్పటికీ కప్ దక్కదేమోనన్న ఆందోళనలో కూరుకుపోయాడు.
ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని..
2025లో జరిగే ఐపీఎల్లో బెంగళూరు ఎలాగైనా కప్ సాధించాలని.. ఆ జట్టు వీరాభిమాని ఒకతను ఏకంగా అయ్యప్ప మాల ధరించాడు. 41 రోజులు నిష్టగా పూజలు చేసి.. ఇరుముడి (irumudi) సమర్పించడానికి శబరిమలై(sabarimalai) వెళ్ళాడు. అక్కడ ఇరుముడి సమర్పించడానికి వెళ్లి.. తాను ఎందుకు అయ్యప్ప మాల ధరించానో చెప్పాడు..” ఈసారి ఎలాగైనా బెంగళూరు జట్టు ఐపిఎల్ విజేతగా ఆవిర్భవించాలి. బెంగళూరు జట్టు అంటే నాకు విపరీతమైన అభిమానం. అందువల్లే అయ్యప్ప మాల ధరించాను. అయ్యప్ప నామస్మరణతో ఇక్కడదాకా వచ్చాను. బెంగళూరు ఎలాగైనా ఐపీఎల్ విజేత కావాలని అయ్యప్ప స్వామిని కోరుకున్నాను. ఇది నెరవేరడానికి నిష్టగా పూజలు చేశాను. నా పూజలు ఫలిస్తాయని నమ్మకం ఉంది. మీరు కూడా బెంగళూరు జట్టుకు సంఘీభావం తెలపండి. బెంగళూరు విజేతగా నిలవాలని పూజలు చేయండి. నేను చేస్తున్న ఈ పూజలు బెంగళూరు జట్టు యాజమాన్యానికి చేరే వేసే విధంగా షేర్ లేదా లైక్ ఆప్షన్ క్లిక్ చేయండి అంటూ” ఆ భక్తుడు కోరాడు. దీనికి సంబంధించిన వీడియో ఇన్ స్టాగ్రామ్ లో తెగ సందడి చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతని ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. ” నీ అంత గొప్పగా బెంగళూరు ఆటగాళ్లు ఆడి ఉంటే కచ్చితంగా ఐపీఎల్ కప్ సాధించుకునేది. కానీ ఏం చేస్తాం.. నీలాంటి అభిమానుల అంచనాలను బెంగళూరు జట్టు అందుకోలేకపోతుంది. ఈసారైనా బెంగళూరు ఎలాగైనా కప్ సాధించాలి. ఇలాంటి అభిమానుల ఆశలను నెరవేర్చాలని” నెటిజన్లు వాపోతున్నారు.