https://oktelugu.com/

Sankranthiki Vastunnam: ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ థియేటర్స్ ని రీ ప్లేస్ చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం..ఇదేమి కుమ్ముడు సామీ!

సంక్రాంతి కానుకగా విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు ఈ చిత్రానికి ఏకంగా 45 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి క్యూలు కట్టేస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : January 15, 2025 / 08:29 PM IST
    Follow us on

    Sankranthiki Vastunnam:  సంక్రాంతి కానుకగా విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు ఈ చిత్రానికి ఏకంగా 45 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి క్యూలు కట్టేస్తున్నారు. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు వెంకటేష్. అయితే వెంకటేష్ తో పాటు ఆయన కొడుకు పాత్ర బుల్లి రాజు కూడా ప్రేక్షకులను ఒక రేంజ్ లో కితకితలు పెట్టింది. కోరుకుతా అంటూ ఈ బుడ్డోడు చేసిన కామెడీ కి ప్రేక్షకులకు థియేటర్స్ లో పగలబడి నవ్వి పొట్ట చెక్కలు అయ్యేంత పని చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ని ఈ బుద్దొద్దు నిలబెట్టేశాడు అని చెప్పొచ్చు.

    ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు, అసలు ఎవరీ బుడ్డోడు?, ఇంతకు ముందు ఏ సినిమాలోనూ చూడలేదే?, చాలా హుషారుగా ఉన్నాడు, అసలు ఎవరు అని వెతకడం మొదలు పెట్టారు. అలా వెతికిన తర్వాత ఇతని పేరు రేవంత్ అని తెలిసింది. ఈయన వెంకటేష్ అల్లుడు రానా దగ్గుపాటి స్నేహితుడికి సంబంధించిన కొడుకు అట. మంచి కామెడీ సెన్స్ ఉన్న పిల్లల కోసం వెతుకుతున్న అనిల్ రావిపూడి ని చూసి స్వయంగా రానా నే ఈ బుడ్డోడిని పరిచయం చేశాడట. ఆడిషన్స్ చేసిన తర్వాత ఈ బుడ్డోడి కామెడీ టైమింగ్ కి అనిల్ రావిపూడి ఒక రేంజ్ లో ఆకర్షితులు అవ్వడంతో వెంటనే అతన్ని చైల్డ్ ఆర్టిస్టుగా పెట్టి సినిమా తీసేసాడు. ఇప్పుడు ఇండస్ట్రీ లోనే హాట్ టాపిక్ గా నిల్చిన ఈ బుడ్డోడికి భవిష్యత్తులో అవకాశాలు ఒక రేంజ్ లో వస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

    ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే జనాలకు ఈ వారం మొత్తం టికెట్స్ కోసం యుద్ధం తప్పేలా లేదు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ ముక్క దొరికితే ఒట్టు అనే విధంగా ఉంది పరిస్థితి. అదే విధంగా హైదరాబాద్ లో అనేక థియేటర్స్ లో ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ చిత్రానికి కేటాయించిన షోస్ ని ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి కేటాయిస్తున్నారు. ఆ షోస్ బుకింగ్స్ ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. ఊపు చూస్తుంటే భవిష్యత్తులో ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అవలీలగా దాటేస్తుందని అంటున్నారు. వెంకటేష్ చిత్రాలకు పాజిటివ్ టాక్ వస్తే కనీసం నెల రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు వస్తుంటాయి. ఈ చిత్రం కూడా వచ్చే నెల వరకు ఆడుతున్డ౮యి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.