IRCTC App : ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్ కొంతకాలంగా సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రైల్వే టిక్కెట్ బుకింగ్‌తో పాటు, ఇతర సేవల బుకింగ్ కూడా ఈ యాప్ తో చేసుకోవచ్చు. దేశంలోని అతిపెద్ద వెబ్‌సైట్ www.irctc.co.in ఇలా సమస్యలను ఎందుకు ఎదుర్కుంటుంది? గత ఒకటిన్నర నెలలో, www.irctc.co.in వెబ్‌సైట్, యాప్ నాలుగు సార్ల కంటే ఎక్కువ డౌన్ సార్లే డౌన్ అయింది. సర్వర్ సమస్య కారణంగా IRCTC వెబ్‌సైట్, యాప్ రెండూ పనిచేయడం లేదని వార్తలు వచ్చాయి. దీంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు కూడా. ఫిర్యాదులు వచ్చిన ప్రతి సారి IRCTC బృందం ఈ సమస్యపై పని చేస్తుందని తెలిపారు.
ప్రతిసారీ, IRCTC కూడా సాంకేతిక సమస్యల కారణంగా సేవకు అంతరాయం కలిగిందని అంగీకరించింది. టికెటింగ్ సేవ తాత్కాలికంగా అందుబాటులో లేదని IRCTC పేర్కొన్న విషయం తెలిసిందే. ఒక ప్రయాణికుడు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ సమస్య వచ్చింది. ఆ తర్వాత అందరికీ ఇదే సమస్య రావడంతో ఆందోళన చెందారు ప్రయాణీకులు. అంటే పీక్ అవర్స్ లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది అన్నమాట.
వెబ్‌సైట్ – యాప్‌లో ఎందుకు సమస్యలు వస్తున్నాయి?
NGeT వ్యవస్థలో సాంకేతిక సమస్య కారణంగా వెబ్‌సైట్‌లో ఈ సమస్య వచ్చిందని IRCTC సీనియర్ అధికారి తెలిపారు. ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో ఉన్న పీఆర్‌ఎస్ కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) అనేది రైల్వే స్టేషన్లలో ఇప్పటికే ఉన్న టిక్కెట్ బుకింగ్ విండో. ఇది కంప్యూటరైజ్డ్ సిస్టమ్. ఇది ప్రయాణీకులు ఆన్‌లైన్‌లో లేదా PRS కౌంటర్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి, రద్దు చేయడానికి ఉపయోగపడుతుంది.
IRCTC వెబ్‌సైట్‌ను ఏ కంపెనీ సిద్ధం చేసింది?
IRCTC అనేది భారతీయ రైల్వేలు, ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ విభాగం. ఇది షెడ్యూల్ ‘A’ మినీరత్న PSU. IRCTC వెబ్‌సైట్, యాప్‌ను CRIS (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) రూపొందించింది. ఇది రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న కంపెనీ. దాని ప్రారంభం నుంచి, CRIS నేషనల్ ట్రాన్స్‌పోర్టర్ కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తుంది. నిర్వహిస్తోంది.
సూపర్ యాప్ ప్రారంభంతో సమస్యకు పరిష్కారం!
అయితే ప్రతి సారి వెబ్ సైట్ సమస్య పునరావృతమవుతున్నప్పుడు, ఈ సాంకేతిక అవకతవకలను నివారించడానికి లేదా తగ్గించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఎందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదనే ప్రశ్న ప్రయాణీకుల నుంచి వస్తుంది? దీనిపై సీనియర్ రైల్వే అధికారి మాట్లాడుతూ, వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని IRCTCని ఆదేశించినట్లు తెలిపారు. ఇండియన్ రైల్వేస్ సూపర్ యాప్‌ను అభివృద్ధి చేసి త్వరలో ప్రారంభించేందుకు మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని అధికారి తెలిపారు. సూపర్ యాప్‌ను ప్రారంభించిన తర్వాత, భవిష్యత్తులో వినియోగదారులు అలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా సూపర్ యాప్‌ను అభివృద్ధి చేసే పని జరుగుతోంది. దీన్ని ప్రారంభించిన తర్వాత సాంకేతిక లోపాలు తగ్గుతాయని అధికారి తెలిపారు. సూపర్ యాప్‌ను CRIS అభివృద్ధి చేస్తోంది. రైల్వే సూపర్ యాప్ కోసం చాలా కాలంగా వేచి ఉంది. ఇప్పుడు ఇది త్వరలో ప్రారంభం కానుంది అన్నమాట. కొత్త మొబైల్ అప్లికేషన్ రైల్వే ప్రయాణికులకు టిక్కెట్ బుకింగ్, ప్రయాణం రెండింటి అనుభవాన్ని సులభతరం చేస్తుంది. కొత్త అప్లికేషన్ ఇప్పటికే ఉన్న వివిధ యాప్‌లు, జాతీయ రవాణాదారు అందించే సేవలను ఏకీకృతం చేస్తుంది.