https://oktelugu.com/

Ravichandran Ashwin : రవిచంద్రన్ అశ్విన్ అంటే బౌలరే కాదు.. కెప్టెన్ యాంగిల్ కూడా ఉంది.. అతడి జట్టు ఏకంగా కప్ కొట్టేసింది..

తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్లో దిండిగుల్ డ్రాగన్స్ అదరగొట్టింది. లీగ్, సెమీఫైనల్ మ్యాచ్ లలో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించింది. ఏకంగా ఫైనల్ దూసుకెళ్లింది.. అయితే డిపెండింగ్ ఛాంపియన్ లైకా కొవాయ్ కింగ్స్ జట్టు ఫైనల్ మ్యాచ్ లో తడబడింది. దిండిగుల్ జట్టు బౌలర్ల దూకుడు ముందు లైకా బ్యాటర్లు నిలబడలేకపోయారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 5, 2024 / 09:11 PM IST
    Follow us on

    Ravichandran Ashwin : రవిచంద్రన్ అశ్విన్.. ఈ పేరు స్ఫురణకు వస్తే.. స్పిన్ బౌలర్ గుర్తుకు వస్తాడు. వికెట్ల మీద వికెట్లు తీసే మాంత్రికుడు జ్ఞప్తికి వస్తాడు. అలాంటి రవిచంద్రన్ లో ఓ కెప్టెన్ కూడా దాగి ఉన్నాడు. టీమిండియాలో అతడికి కెప్టెన్ అయ్యే అవకాశం లేదు కాని.. అలాంటి అవకాశం వస్తే సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. బీసీసీఐ అవకాశం ఇవ్వకపోయినప్పటికీ అతడు కెప్టెన్ అయిపోయాడు. తన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. తన జట్టును విజేతను చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సెర్చింగ్ పర్సనాలిటీ అయిపోయాడు. తమిళనాడులో TNPL 2024 పేరుతో తమిళనాడు ప్రీమియర్ లీగ్ టోర్నీ నిర్వహించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ టోర్నీ జరుగుతోంది. ఈసారి జరిగిన టోర్నీలో రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వం వహిస్తున్న దిండిగుల్ డ్రాగన్స్ (Dindigul dragons) తొలిసారిగా ఛాంపియన్ అయ్యింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో లైకా కొవాయ్ కింగ్స్ (Laika kovai kings) జట్టుపై అద్భుత విజయ సాధించి ట్రోఫీని అందుకుంది. డ్రాగన్స్ జట్టు స్వల్ప లక్ష్యం విధించింది. దానిని ఛేదించడంలో రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా హాఫ్ సెంచరీ చేశాడు. ఇక్కడికి బాబా ఇంద్రజిత్ (32), శరత్ కుమార్ (27*) సహకరించడంతో దిండిగుల్ జట్టు 6 వికెట్ల తేడాతో జయకేతనం ఎగరవేసింది.

    తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్లో దిండిగుల్ డ్రాగన్స్ అదరగొట్టింది. లీగ్, సెమీఫైనల్ మ్యాచ్ లలో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించింది. ఏకంగా ఫైనల్ దూసుకెళ్లింది.. అయితే డిపెండింగ్ ఛాంపియన్ లైకా కొవాయ్ కింగ్స్ జట్టు ఫైనల్ మ్యాచ్ లో తడబడింది. దిండిగుల్ జట్టు బౌలర్ల దూకుడు ముందు లైకా బ్యాటర్లు నిలబడలేకపోయారు. కట్టుదిట్టమైన బంతులు వేస్తూ పరుగులు చేయకుండా నిలుపుదల చేశారు. దిండిగుల్ జట్టు బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (2/26), విగ్నేష్ (2/15) అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో లైకా జట్టు బ్యాటర్లు పెవిలియన్ చేరేందుకు పోటీపడ్డారు. లైకా జట్టు ఓపెనర్ సుజయ్(22), రామ్ అరవింద్ (27), రెహమాన్ (25) కీలక ఇన్నింగ్స్ ఆడి ఒక మోస్టర్ స్కోర్ అందించారు. దీంతో నిర్ణిత 20 ఓవర్లలో లైకా జట్టు 7 వికెట్ల కోల్పోయి 129 రన్స్ మాత్రమే చేయగలిగింది.

    130 టార్గెట్ తో దుండిగల్ జట్టు రంగంలోకి దిగింది. ఆ జట్టుకు ఆశించిన స్థాయిలో ఆరంభం లభించలేదు. 23 పరుగులకే రెండు కీలకమైన వికెట్లు నష్టపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ (52), బాబా ఇంద్రజిత్ (32) జట్టు బారాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. వీరిద్దరూ లైకా జట్టు బౌలర్లను ప్రతిఘటిస్తూ దుండిగల్ జట్టు స్కోరును పరుగులు పట్టించారు.. వీరిద్దరూ 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోరు 121 పరుగుల వద్దకు చేరుకున్నప్పుడు రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్ చేరుకున్నాడు. అప్పటికే దుండిగల్ జట్టు గెలుపునకు చేరువైంది. అశ్విన్ ఆడిన తర్వాత శరత్ కుమార్ (27*), భూపతి కుమార్(3*) తదుపరి లాంఛనం పూర్తి చేశారు. ఈ విజయంతో దుండిగల్ జట్టు తొలిసారి విజేతగా ఆవిర్భవించింది. ఈ గెలుపుతో దుండిగల్ జట్టు సంబరాలు మిన్నంటాయి. వాస్తవానికి గత ఎనిమిది ఎడిషన్లలో దుండిగల్ జట్టు సత్తా చాటుతున్నప్పటికీ విజేత కాలేకపోయింది. మరోవైపు లైకా జట్టు గత ఏడాది విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో మాత్రం డిపెండింగ్ ఛాంపియన్ స్థాయిలో ఆట తీరును ప్రదర్శించలేకపోయింది.. ఇక రవిచంద్రన్ అశ్విన్ బంతితో రాణించలేకపోయినప్పటికీ.. బ్యాట్ తో సత్తా చాటాడు. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించి లైకా జట్టుకు చుక్కలు చూపించాడు.

    ఈ గెలుపు నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది..”అతడు తమిళనాడు ఆణిముత్యం. బౌలింగ్లో సత్తా చాటాడు. ఇప్పుడు బ్యాటింగ్ లోనూ అదరగొడుతున్నాడు..ఫైనల్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆల్ రౌండర్ , నాయకుడు అనే పదాలకు సంపూర్ణ న్యాయం చేశాడని” అభిమానులు రవిచంద్రన్ అశ్విన్ పై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.