Bangladesh Protests : దేశ ప్రధాని ఇంట్లో చొరబడి దోపిడీలు, తీరిగ్గా భోజనాలు.. ఇదేం కంట్రీరా బాబు.. ఇంత దారుణంగా ఉన్నారు

రిజర్వేషన్లలో మార్పు బంగ్లాదేశ్‌లో చిచ్చు రేపింది. కొన్ని రోజులుగా అల్లర్లు జరుగుతున్నాయి. సుప్రీం కోర్టు తప్పు పట్టినా.. అ‍ప్పటికే అల్లర్లు పెరిగాయి. ఈ గొడవలో ఇప్పటి వరకు 300 మంది మరణించారు. దీంతో సైన్యం రగంలోకి దిగింది. ప్రధానిని హెచ‍్చరించింది. దీంతో ఆమె దేశం విడిచి పారిపోయారు.

Written By: NARESH, Updated On : August 5, 2024 8:20 pm

Bangladesh Protests

Follow us on

Bangladesh Protests : మన పొరుగు దేశం.. మన మిత్రదేశం బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అంశం కొన్ని రోజులుగా చిచ్చు రేపింది. స్వాంతంత్రోద్యమంలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో అమరులైన కుటుంబాల పిల్లలకు ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని షేక్‌ హసీలా నిర్ణయించారు. దీనికి ఆదేశ సుప్రీం కోర్టు బ్రేక్‌ వేసింది. అయితే అప్పటికే దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. నిత్యం ఏదో ఒకచోట రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అల్లుర్లు జరుగుతున్నాయి. ఆందోళనకారులు, ప్రభుత్వ అనుకూల వాదుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవలే ఆందోళనకారులు పోలీసు వాహనానికి కూడా నిప్పు పెట్టారు. దీంతో 10 మంది పోలీసులు జరిపోయారు. ఇక అల్లర్ల కారణంగా ఆదివారం(ఆగస్టు 5) వరకు బంగ్లాదేశ్‌లో 300 మంది మరణించారు. అల్లర్లను అదుపుచేయడంలో విఫలమైన ప్రధాని షేక్ హసీనాపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ ప్రధాని పదవి వీడాలని, దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. దీంతో అప్రమత్తమైన షేక్‌ హసీనా వెంటనే సైనిక హెలిక్యాప్టర్‌లో ప్రాణాలు అరచేత పట్టుకుని మన ఈశాన్య రాష్ట్రం త్రిపుర రాజధాని అగర్తలకు వచ్చారు. దీంతో ఆర్మీ అధికారం చేపట్టే అవకాశం కనిపిస్తోంది.

ప్రధాని నివాసంలోకి అల్లరి మూకలు..
ప్రధాని దేశం విడిచి పారిపోయారని అక్కడి మీడియాలో కథనాలు రావడంతో అల్లరి మూకలు ఒక్కసారిగా షేక్‌ హసీనా నివాసంపైకి దండెత్తాయి. రోడ్డపైన సంబురాలు చేసుకున్నారు. సంతోషంతో జాతీయ జెండాలు పట్టుకుని రోడ్లపై డ్యాన్సులు చేశారు. లక్షల మంది విద్యార్థులు రోడ్లపై ర్యాలీలు తీశారు. కొందరు అల్లరి మూకలు రాజధాని ఢాకాలోని ప్రధాని హసీనా నివాసం గనా భవన్‌ గేట్లు బద్దలు కొట్టుకుని లోనికి దూసుకెళ్లారు. ఇల‍్లంతా రచ్చరచ్చ చేశారు. డైనింగ్‌ ఏరియాలో కూర్చుని భోనం చేశారు. స్విమ్మింగ్‌పూల్‌ చిందరవందర చేశారు. చేతికి దొరికిన వస్తువులు ఎత్తుకెళ్లారు. కుర్చీలు, బల్లలు, బెడ్‌షీట్లు, చైర్లు, గడియారాలు, కోళ్లు మేకలు అపహరించారు. ప్రధాని నివాసంలో బెడ్లపై పడుకుని ఫొటోలు దిగారు.

పార్లమెంటులో చిల్లర..
ఇక కొందరు అల్లరి మూకలు బంగ్లాదేశ్‌ పార్లమెంటు భవనంలోకి దూసుకెళ్లారు. సభలో సీట్లలో కూర్చుని బల్లలపైకి కాళ్లు చాచారు. సిగరెట్లు తాగారు. ఎంపీల స్థానాల్లో కూర్చుని సెల్ఫీలు దిగారు. దేశంలో పాలన అదుపు తప్పితే ఎలా ఉంటుందో నిరూపించారు. గతంలో శ్రీలంకలోనూ ఇదే తరహా అల్లర్లు జరిగాయి. అవి ప్రధాని నివాసానికే పరిమితం అయ్యాయి. బంగ్లాదేశ్‌లో​ పార్లమెంటు వరకు వెళ్లాయి. హసీనా తండ్రి విగ్రహం ధ్వంసం చేశారు. ఇదంతా ముందే పసిగట్టిన హసీనా తన అధికారిక నివాసాన్ని వీడి పరారయ్యారు. మరోవైపు దేశంలో ఆందోళనకారుల్ని అణచివేయాలన్న హసీనా కుమారుడి ఆదేశాల్ని ఆర్మీ లెక్కచేయట్లలేదు.