Ravi Shastri
Ravi Shastri : ప్రస్తుతం దుబాయ్ వేదికగా ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions trophy) ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా, న్యూజిలాండ్ (IND vs NZ) జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడుతున్నాయి.. ఈ క్రమంలో ఐసీసీ రివ్యూలో పలు విషయాలను రవి శాస్త్రి ఈ సందర్భంగా విశ్లేషించాడు.. రవి శాస్త్రి సచిన్ టెండుల్కర్ తో కలిసి క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు. విరాట్ కోహ్లీకి కోచ్ గా వ్యవహరించాడు. విరాట్ కోహ్లీ ఇప్పటికే వన్డే లలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. వన్డేలలో ఎక్కువ సెంచరీల రికార్డును ఇప్పటికే విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. ఇంకో 55 పరుగులు చేస్తే ఈ ఫార్మాట్లో హైయెస్ట్ రన్స్ చేసిన రెండవ ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలుస్తాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్(18,426) నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా – న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఐసీసీ రివ్యూలో పలు అంశాలను విశ్లేషించిన రవి శాస్త్రి.. పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
Also Read : విరాట్ ఇంకా నాలుగేళ్లు ఆడతాడు.. కానీ రోహిత్ కు సమయం ఆసన్నమైంది: రవి శాస్త్రి
విరాట్ కోహ్లీ అందుకే GOAT
విరాట్ కోహ్లీని గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) గా రవి శాస్త్రి అభివర్ణించాడు..” ఆట మీద విరాట్ కోహ్లీకి క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. మ్యాచ్ పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉంటుంది. ఇవన్నీ విరాట్ కోహ్లీని స్టార్ ఆటగాడిగా నిలబెట్టాయి. గత నాలుగు సంవత్సరాలుగా అంచనాలకు మించి రాణించాలని విరాట్ కోహ్లీ ప్రయత్నించాడు. తన ద్వారా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయడు. వన్డేలలో టార్గెట్ చేజ్ చేసేటప్పుడు కోహ్లీ మరింత నాణ్యమైన క్రికెట్ ఆడతాడు. సింగిల్స్ తీస్తూ పరుగులను చేస్తుంటాడు. యధావిధిగా ముందుకు సాగితే ఫలితం మరో విధంగా ఉంటుంది. ఈ విషయం విరాట్ కోహ్లీకి తెలుసు. శ్రేయస్ అయ్యర్ లాంటి బ్యాటర్ అవతల ఉన్నప్పుడు విరాట్ ఇంకా గొప్పగా ఆడతాడు. అప్పుడు టార్గెట్ చేజ్ మరింత ఈజీ అవుతుందని” రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు. ” ఉత్సాహంగా ఆడే క్రీడాకారులను అభిమానులు విపరీతంగా ఆరాధిస్తారు. ఫుట్ బాల్ లో రోనాల్డో, మెస్సీ, టెన్నిస్ లో జకోవిచ్, నాదల్ గొప్పగా ఆడతారు. వారు గొప్పగాటం వల్ల ఆ క్రీడలకు విపరీతమైన ఆదరణ లభించింది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ కూడా కీలక స్థానం ఉంటుంది. అతడి ఆట తీరు చూసేందుకు అభిమానులు భారీగా వస్తుంటారు. సచిన్ టెండూల్కర్ కూడా గొప్పగా బ్యాటింగ్ చేస్తాడు. అతడు క్రికెట్ అద్భుతంగా ఆడతాడు. క్రికెట్ కే వన్నెతెచ్చిన ఆటగాడు అతడు. క్రికెట్ కోసం అతడు చాలా త్యాగాలు చేశాడు. నచ్చిన ఆహారాన్ని కూడా వదులుకున్నాడు. సచిన్ టెండూల్కర్ ఆహారాన్ని తినడం విపరీతంగా ఇష్టపడుతుంటాడు. కానీ క్రికెట్ కోసం అతడు నచ్చిన ఆహారాన్ని తినడం మానుకున్నాడు. క్రికెట్ లో రాణించడానికి అహోరాత్రాలు సచిన్ శ్రమించాడు. అతడి త్యాగాన్ని నేను దగ్గరుండి చూశాను. అందువల్లే అతడు గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడని” రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు.
Also Read : ఆ దృశ్యాలు కళ్ళముందు కనిపించాయి.. అందువల్లే నితీష్ సెంచరీ చేసినప్పుడు ఏడ్చేశాను: రవి శాస్త్రి