Court : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా'(Wallposter Cinema) నుండి తెరకెక్కిన చిత్రం ‘కోర్ట్'(Court Movie). హర్ష రోషన్, శ్రీదేవి హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలో ప్రియదర్శి(Priyadarshi) ముఖ్య పాత్ర పోషించాడు. సీనియర్ హీరో, బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ శివాజీ(Hero Shivaji) ఈ చిత్రం లో హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించాడు. రీసెంట్ గానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి, గ్రాండ్ గా ట్రైలర్ ని విడుదల చేయగా, దానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక మేజర్ అబ్బాయి మైనర్ అమ్మాయి మధ్య జరిగే ప్రేమ కథ, అమ్మాయి లో ఇంట్లో పరువు కోసం ఏమైనా చేయడానికి సిద్దపడే తండ్రి, హీరో పై లేని పోనీ కేసులన్నీ బనాయించి అతని జీవితాన్ని నాశనం చేయాలని అనుకోవడం, చివరికి పోక్సో చట్టం క్రింద కూడా హీరో పై కేసు నమోదు అవ్వడం వంటివి ఈ సినిమాలో చూపించినట్టు ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది.
Also Read : ఆకట్టుకుంటున్న ‘కోర్ట్’ థియేట్రికల్ ట్రైలర్..నిర్మాతగా నాని ఖాతాలో మరో హిట్ పడినట్టే!
హీరో తరుపున వాదించి, అతనికి న్యాయం చేకూరేలా పోరాటం చేసే న్యాయవాది క్యారక్టర్ లో ప్రియదర్శి కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ని నిన్న రాత్రి ఇండస్ట్రీ లోని కొంతమంది ముఖ్యమైన వాళ్లకు నాని వేసి చూపించాడట. వాస్తవానికి ఆయన 12 వ తేదీన ఇండస్ట్రీ లో ఉన్న వాళ్లందరికీ సినిమాని ముందుగా చూపిస్తానని చెప్పాడు కానీ, అంతకంటే ముందే మొదటి కాపీ సిద్ధం అవ్వడం తో ఒకసారి ఎలా ఉందో చూసి, ఏమైనా మార్పులు చేర్పులు చేసే సూచనలు ఇచ్చే తన సన్నిహితులకు మాత్రమే ఈ సినిమాని చూపించాడట. వాళ్ళ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వాచినట్టు సమాచారం. ఒక్క సన్నివేశాన్ని కూడా తొలగించాల్సిన అవసరం లేదని, సినిమా చాలా పర్ఫెక్ట్ గా ఉందని చెప్పారట. రేపు ఈ సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సినిమాకి సెకండ్ హాఫ్ గుండె లాంటిదట. కోర్టు డ్రామా అంటే ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ సినిమాలో అలాంటివి ఏవి లేవట. కోర్టు డ్రామా మొదలైనప్పటి నుండి ఆడియన్స్ ఆసక్తిగా సీట్ల నుండి కదలకుండా చూసే విధంగా స్క్రీన్ ప్లే ని నడిపించాడట డైరెక్టర్. ముఖ్యంగా క్లైమాక్స్ తర్వాత థియేటర్స్ నుండి బయటకి వచ్చే ప్రతీ ప్రేక్షకుడి కళ్ళలో నీళ్లు తిరిగి ఉంటుందని అంటున్నారు. అంత అద్భుతంగా వచ్చాయట సన్నివేశాలు. ఇన్సైడ్ రిపోర్ట్స్ అయితే అదిరిపోయాయి, కానీ ఆడియన్స్ నుండి కూడా ఇలాంటి రిపోర్ట్స్ వస్తుందనే నమ్మకం లేదు. కాబట్టి అసలు సినిమా ఎలా ఉంది ఏమిటి అనేది తెలియాలంటే మార్చి 14 వరకు ఆగాల్సిందే. ఈ సినిమా నేను చెప్పిన రేంజ్ లో లేకపోతే, నా ‘హిట్ 3’ చిత్రం చూడకండి అంటూ నాని చాలా పెద్ద వ్యాఖ్యలు చేసాడు, చూడాలి మరి ఎలా ఉండబోతుందో.
Also Read : నాని ఊర మాస్ సినిమాలు చేయడం వెనక అసలు కారణం ఇదేనా..?