Ravi Shastri : క్రికెట్ లో ఏ మూల టాలెంట్ బయటికి వచ్చినా.. ఏ దేశంలో ఆటగాడు గొప్పగా ఆడినా వెంటనే పొగిడేస్తుంటాడు రవి శాస్త్రి. క్రికెట్ ను ఆరాధిస్తాడు.. గొప్పగా ఆడుతున్న ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఉంటాడు. అయితే తన ఇన్నేళ్ల క్రీడా జీవితంలో.. ఎన్నడూ కంట నీరు పెట్టుకోలేదు. కన్నీరు ఒలికించలేదు. అయితే అటువంటి రవి శాస్త్రి తొలిసారిగా ఏడ్చాడు. కామెంట్రీ బాక్స్ లో తోటి కామెంట్రేటర్ మాట్లాడుతుంటే.. అలా కన్నీరు కార్చాడు. ఈ దృశ్యం శనివారం నుంచి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వాస్తవానికి ఎంతో ధైర్యంగా.. మరింత గుంబనంగా ఉంటాడు రవి శాస్త్రి. అందువల్లే ఓటమి వచ్చినా.. గెలుపు సొంతమైనా ఏ మాత్రం చలించడు. అయితే అటువంటి ఆటగాడు తొలిసారి అలా తన భావోద్వేగాన్ని అణుచుకోకుండా ఏడవడం సంచలనం కలిగించింది. అయితే దీనిపై అతడే తొలిసారిగా స్పందించాడు.
అందువల్లే ఏడ్చాడట
శనివారం సెంచరీ చేసిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డిని చూసి రవి శాస్త్రి ఏడ్చాడు. గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు అంటూ అభిప్రాయపడ్డాడు. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో స్ఫూర్తిదాయకమైన ఆట తీరును ప్రదర్శించిన ఆటగాడిని నేను చూడలేదని రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్ భారత డ్రెస్సింగ్ రూమ్ లో నితీష్ కుమార్ రెడ్డి కుటుంబంతో రవి శాస్త్రీ ని కలిశాడు. ” కామెంట్రీ బాక్స్ లో నువ్వు కామెంట్రీ చెప్తుండగా నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. నువ్వు మాట్లాడుతున్నంత సేపు నితీష్ కుమార్ రెడ్డి జీవితానికి సంబంధించిన దృశ్యాలు మొత్తం కళ్ళ ముందు కనిపించాయి. అప్పుడు నాకు అనిపించింది ఇతడు ఆట మీద మాత్రమే ఆసక్తి పెంచుకున్నాడని… గొప్పగా ఆడటానికి ఏదైనా చేస్తాడని.. నాకు తెలియకుండానే కళ్ళ నుంచి అలా నీళ్లు వచ్చేశాయి. ఏం మాట్లాడాలో తెలియ రాలేదు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. గొప్ప దృశ్యాన్ని చూసాననే అనుభూతి కలిగింది. మెల్ బోర్న్ మైదానంలో సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. నితీష్ కుమార్ రెడ్డి కోసం అతడి తండ్రి చేసిన త్యాగం గొప్పగా అనిపించింది. అందుకే నాకు తెలియకుండానే నా కళ్ళ నుంచి నీళ్లు వచ్చేశాయి. అతడు నన్ను బాగా ఆకట్టుకున్నాడు. అతడి దృష్టి నా మీద పడేలా చేసుకున్నాడు. చూస్తుంటే అతడు అద్భుతంగా ఆవిష్కారమవుతాడు. అందులో ఎటువంటి సందేహం లేదని” శాస్త్రి వ్యాఖ్యానించాడు.. శనివారం రాత్రి భారత డ్రెస్సింగ్ రూమ్ లో రవి శాస్త్రిని నితీష్ కుమార్ రెడ్డి కుటుంబం కలిసింది. ఈ సందర్భంగా తన కొడుకు కెరియర్ కు తాను చేసిన త్యాగాన్ని.. వదులుకున్న ఉద్యోగాన్ని.. ముత్యాల రెడ్డి రవి శాస్త్రికి వివరించాడు.
VIDEO OF THE DAY ❤️
– Nitish Kumar Reddy’s family meeting Sunil Gavaskar & Ravi Shastri at MCG. pic.twitter.com/E9EAYfPK8d
— Johns. (@CricCrazyJohns) December 29, 2024