Daku Maharaj Trailer : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉండడం విశేషం… ముఖ్యంగా బాలకృష్ణ లాంటి నటుడు దాదాపు 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే బాలయ్య చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన బాబి డైరెక్షన్ లో ‘డాకు మహారాజు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యం లో ఈ సినిమాను ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ గా నిలపాలని బాబి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి బాబీ అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కి మరొక 20 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపధ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని జనవరి మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ఈ ట్రైలర్ లో బాలయ్య బాబు మాస్ అవతారంలో కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నేపధ్యం లో మరొక కొత్త ట్రైలర్ యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి తను తనకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి తద్వారా స్టార్ హీరోగా బాలయ్య బాబు అవతరిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఇప్పటివరకు బాబి డైరెక్షన్ లో వచ్చిన అన్ని సినిమాలు చాలావరకు ప్రేక్షకులను మెప్పించాయి. కాబట్టి ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించి తనదైన రీతిలో అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెడుతుందనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక మాస్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉండబోతున్నాయి అంటూ ఇప్పటికే బాబి ఇన్ డైరెక్టుగా ప్రేక్షకులందరికి తెలియజేస్తూ వస్తున్నాడు. ఇక ట్రైలర్ ని చూస్తే ప్రేక్షకులు మాస్ జాతర చేసుకుంటారు అంటూ ఆయన తన సన్నిహిత వర్గాల దగ్గర తెలియజేస్తున్నట్టుగా తెలుస్తోంది…