Ravi Bishnoi Catch: క్యాచ్ ఇలా కూడా పడతారా: కేన్ మామ బిత్తర పోయాడు.. వీడియో వైరల్

ఆదివారం రాత్రి గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ అద్భుతం చేశాడు.. ఎనిమిదవ ఓవర్ లో రెండవ బంతిని రవి బిష్ణోయ్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 8, 2024 10:11 am

Ravi Bishnoi Catch

Follow us on

Ravi Bishnoi Catch: ఎవడైనా రెండు చేతులతో పడతాడు. లేదా ఒక చేత్తో పడతాడు.. లేకుంటే గాల్లోకి ఎగిరి పడతాడు. వీడేంటి ఇలా పట్టాడు.. అసలు ఒంట్లో ఎముకలు ఉన్నాయా.. లేకుంటే సూపర్ మ్యానా? ఐపీఎల్ కు ముందు జిమ్నాస్టిక్స్ లో ట్రైన్ అయ్యాడా? తను ఆడిన బంతిని క్యాచ్ పట్టిన తర్వాత కేన్ విలియంసన్ ఇలాగే అనుకుని ఉంటాడు కావచ్చు.. ఎందుకంటే లక్నో ఆటగాడు రవి బిష్ణోయ్ అలాంటి క్యాచ్ పట్టాడు మరి. ఇది కేవలం క్యాచ్ మాత్రమే కాదు. గుజరాత్ జట్టు ఓటమికి కారణమైంది. లక్నో జట్టు అప్రతిహత విజయానికి నాంది పలికింది.

అద్భుతం చేశాడు

ఆదివారం రాత్రి గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ అద్భుతం చేశాడు.. ఎనిమిదవ ఓవర్ లో రెండవ బంతిని రవి బిష్ణోయ్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు. ఆ బంతిని సరిగ్గా అంచనా వేయకుండా విలియంసన్ బౌలర్ పక్క నుంచి పంచ్ షాట్ ఆడాడు. వాస్తవానికి ఆ బంతిని ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఆడితే ఎక్కడో స్టాండ్స్ అవతల పడుతుంది. కానీ కేన్ విలియంసన్ తప్పుగా ఆలోచించి పంచ్ షాట్ ఆడాడు. అయితే బంతి బ్యాట్ మధ్యలో తగిలింది. బంతి అమాంతం రవి బిష్ణోయ్ కుడివైపు గాలిలో లేచింది. రెండో మాటకు తావు లేకుండా.. లిప్త పాటు కాలంలో రవి బిష్ణోయ్ గాల్లోకి లేచాడు. ఒంటి చేత్తో బంతిని అదిమి పట్టుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూడగానే ఒక్కసారిగా విలియంసన్ షాక్ కు గురయ్యాడు.

వైరల్

ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. లక్నో ఫ్యాన్స్ రవి బిష్ణోయ్ క్యాచ్ అందుకున్న విధానాన్ని చూసి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు..” వారెవ్వా ఏం క్యాచ్ పట్టావ్. రవి బిష్ణోయ్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. మ్యాచ్ అనూహ్య మలుపునకు కారణమైందని” వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి కెన్ విలియంసన్ అవుట్ కాకుండా ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. కాకపోతే అతడు ఒక పరుగు చేసి ఔట్ కావడంతో గుజరాత్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. శరత్, విజయ్ శంకర్, దర్శన్ నల్కండే విఫలం కావడంతో గుజరాత్ జట్టు 130 పరుగులకే కుప్ప కూలింది. 33 పరుగుల తేడాతో లక్నో జట్టు చేతిలో ఓటమిపాలైంది.