https://oktelugu.com/

Exit Polls 2024: ఏపీలో గెలుపు ఎవరిదంటే.. ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ సంచలనం

పార్దా దాస్ సర్వేలో మరోసారి వైసీపీ దే విజయం అని తేలింది. 50 శాతం ఓట్లతో వైసిపి ఘనవిజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే తేల్చి చెప్పింది. ఆ పార్టీకి 110 నుంచి 120 స్థానాలు దక్కే ఛాన్స్ ఉందని తేలింది.

Written By:
  • Dharma
  • , Updated On : June 1, 2024 6:27 pm
    Exit Polls 2024

    Exit Polls 2024

    Follow us on

    Exit Polls 2024: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. గత నెల 13న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లోక్సభ స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈనెల 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇంతలో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఫలితాలను సర్వే సంస్థలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

    పార్దా దాస్ సర్వేలో మరోసారి వైసీపీ దే విజయం అని తేలింది. 50 శాతం ఓట్లతో వైసిపి ఘనవిజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే తేల్చి చెప్పింది. ఆ పార్టీకి 110 నుంచి 120 స్థానాలు దక్కే ఛాన్స్ ఉందని తేలింది. ఇక టిడిపి కూటమి 46% ఓటింగ్ తో 55 నుంచి 65 సీట్లు దక్కించుకోనుందని తేల్చింది. కాంగ్రెస్ కూటమి 2.5% ఓట్లు సాధించనుందని.. ఇతరులు 1.5% ఓట్లు సాధించనున్నారని ఈ సర్వే తేల్చింది.

    చాణిక్య ఎగ్జిట్ పోల్ సంస్థ వైసీపీ దే విజయం అని తేల్చి చెప్పింది. వైసీపీ 110 నుంచి 120 సీట్లు దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తోంది. టిడిపి కూటమి 55 నుంచి 65 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు తేలింది.

    పోల్ స్ట్రాటజీ సంస్థ సైతం వైసీపీకే జై కొట్టింది. వైసిపి 115 నుంచి 125 సీట్లు దక్కించుకునే ఛాన్స్ ఉందని తేల్చింది. పార్లమెంట్ స్థానాలు సైతం 16 నుంచి 18 సీట్లు పొందే అవకాశం ఉంది. టిడిపి 50 నుంచి 60 అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ స్థానాలు ఏడు నుంచి తొమ్మిది దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తానికైతే వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది.