Rahul Dravid: ఎప్పుడో 2007లో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత మొన్నటి వరకు మరోసారి దక్కించుకోలేకపోయింది. 2014లో ఫైనల్ వెళ్లినప్పటికీ.. శ్రీలంక చేతిలో ఓడిపోయింది. 2022 లో ఇంగ్లాండ్ చేతిలో సెమీ ఫైనల్లో దారుణమైన ఓటమిని మూటకట్టుకుంది. ఆ తర్వాత ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఓటమనేదే లేకుండా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ను ఏడు పరుగుల తేడాతో ఓడించింది .. దర్జాగా t20 వరల్డ్ కప్ రెండవసారి ఒడిసి పట్టింది.
ఫైనల్లో గెలిచిన తర్వాత టీమిండి ఆటగాళ్లు మైదానంలో విపరీతంగా సందడి చేశారు. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బార్బడోస్ మైదానంపై అలానే పడుకుని ఉండిపోయాడు. తన చేతితో ఐదారు నాక్స్ ఇచ్చాడు. అవుట్ ఫీల్డ్ ను ముద్దు పెట్టుకున్నాడు. పచ్చికను, మట్టిని తన నోట్లో వేసుకున్నాడు. ఈ మైదానం తనకు ఎంతో ప్రత్యేకమని.. జీవితాంతం గుర్తుంచుకుంటానని వ్యాఖ్యానించాడు… విరాట్ కోహ్లీ, అర్ష్ దీప్ సింగ్ అద్భుతంగా డ్యాన్స్ చేశారు.. కోచ్ రాహుల్ ద్రావిడ్ ను చేతులపైకి ఎత్తుకొని గాల్లోకి నాలుగైదు సార్లు విసిరేశారు.
Believe. Become. Conquer!
Some glorious moments from #TeamIndia‘s dressing room after the victory in Barbados #Champions #T20WorldCup2024 pic.twitter.com/eYB7PXuLGH
— BCCI (@BCCI) July 2, 2024
ఇక టి20 వరల్డ్ కప్ అందుకున్న సమయంలో రోహిత్ శర్మ సరికొత్త అవతారాన్ని ప్రేక్షకులకు చూపించాడు. 2022 ఖతార్లో జరిగిన ఫిఫా ఫుట్ బాల్ కప్ ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా విజయం సాధించగా.. ఆ జట్టు కెప్టెన్ వినూత్నంగా నడుచుకుంటూ వచ్చి ట్రోఫీని అందుకున్నాడు. అలాగే రోహిత్ కూడా నడుచుకుంటూ వచ్చి టి20 వరల్డ్ కప్ ను అందుకున్నాడు. సోషల్ మీడియాను ఇప్పటికీ ఈ వీడియో హోరెత్తిస్తోంది.
ట్రోఫీ గెలుచుకున్న తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఒకసారిగా ఉద్వేగానికి గురయ్యారు. కామెంట్రీ బాక్స్ లో ఉన్న రవి శాస్త్రి గట్టిగా అరిచాడు. ” ఇది ఇండియా సమయం. ఇండియా గెలిచేసింది. 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు చెక్ పెట్టింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా టీమిండియా కు 50 t20 మ్యాచ్ లలో విజయాలను అందించాడు. ప్రపంచంలో మరే కెప్టెన్ కూడా అతడి దరిదాపుల్లో లేడు..” అంటూ వ్యాఖ్యానించాడు.. రోహిత్ ట్రోఫీ స్వీకరించిన అనంతరం.. ఆటగాళ్లు మైదానంలో సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ట్రోఫీని పట్టుకొని రకరకాల భంగిమలలో ఫోటోలకు ఫోజులిచ్చారు..
సంబరాలు ముగిసిన అనంతరం.. డ్రెస్సింగ్ రూమ్ లో ఒకింత ఉద్విగ్నమైన వాతావరణం నెలకొంది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒకసారిగా ఉద్వేగానికి గురయ్యాడు. కన్నీటిని తుడుచుకుంటూ ట్రోఫీని సగర్వంగా ప్రదర్శించాడు. మిగతా ఆటగాళ్లు కూడా అదే స్థాయిలో ఎమోషన్ అయ్యారు. టి20 వరల్డ్ కప్ కోసం ఎన్ని సంవత్సరాలుగా తాము ఎదురు చూస్తున్నామో వారి హావభావాల ద్వారా చూపించారు. ఈ వీడియోలో బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేసింది. వీడియోలు చూసిన అనంతరం నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ” టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించడం గొప్ప విషయం. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ దాకా వెళ్ళింది. ఫైనల్ లోనూ విజయ పరంపరను కొనసాగించిందని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు..
-!
The sacrifices, the commitment, the comeback
️ #TeamIndia Head Coach Rahul Dravid’s emotional dressing room speech in Barbados #T20WorldCup pic.twitter.com/vVUMfTZWbc
— BCCI (@BCCI) July 2, 2024