Australia: టి20 లో ఆస్ట్రేలియా పప్పులుడకవు గాని.. ఆ విభాగంలో మాత్రం కొట్టే జట్టు లేదు

వన్డే అంటే చాలు ఆస్ట్రేలియా ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడతారు. ఇక వరల్డ్ కప్ లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు. 1987లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విజయప్రస్థానం మొదలైంది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 2, 2024 6:09 pm

Australia

Follow us on

Australia: 2007 నుంచి మొదలైన టి20 వరల్డ్ కప్ లో ఇప్పటివరకు రెండేసి సార్లు ట్రోఫీలను దక్కించుకున్న జట్లలో వెస్టిండీస్, ఇంగ్లాండ్, భారత్ ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఒక్కసారి మాత్రమే టి20 వరల్డ్ దక్కించుకుంది. మరోసారి టీ 20 వరల్డ్ కప్ దక్కించుకోవాలని ఆ జట్టు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. 2021లో న్యూజిలాండ్ జట్టును మట్టి కరిపించి తొలిసారి టి20 వరల్డ్ కప్ దక్కించుకుంది. ఆ తర్వాత 2010లో ఫైనల్ వెళ్లినప్పటికీ.. ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. 2021 తర్వాత , రెండుసార్లు టి20 వరల్డ్ కప్ లు జరిగాయి. అయినప్పటికీ ఆస్ట్రేలియా విజయం సాధించలేకపోయింది. గత ఏడాది స్వదేశంలో t20 వరల్డ్ కప్ జరిగినప్పటికీ ఆస్ట్రేలియా దక్కించుకోలేకపోయింది.. కానీ ఇదే ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ విషయంలో మాత్రం భిన్నంగా ఆడుతోంది.. గత ఏడాది భారత వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ను దక్కించుకుంది. ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టును ఓడించి ట్రోఫీని అందుకుంది.

వన్డే అంటే చాలు ఆస్ట్రేలియా ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడతారు. ఇక వరల్డ్ కప్ లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు. 1987లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విజయప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత 1999, 2003, 2007, 2015, 2023 ఇలా మొత్తం ఆరుసార్లు ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇందులో 2003, 2023లో టీమ్ ఇండియాలో ఫైనల్ లో చిత్తు చేసి.. ఆస్ట్రేలియా విశ్వవిజేతగా ఆవిర్భవించింది.. గత భారత్లో జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో.. ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్ వచ్చేసింది. ఫైనల్ లో ముందుగా టీమిండియాను 240 పరుగులకు కట్టడి చేసి.. ఆ తర్వాత నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేదించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ కు కన్నీటిని మిగిల్చింది.. ఈ పరాజయం నుంచి కోలుకునేందుకు టీమిండియా కు చాలా సమయమే పట్టింది.. ఇక ఇటీవలి టి20 వరల్డ్ కప్ లో.. సూపర్ -8 మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించి వన్డే వరల్డ్ కప్ పరాజయానికి టీం ఇండియా ప్రతీకారం తీర్చుకుంది.

ఇక ఆస్ట్రేలియా తర్వాత వన్డే వరల్డ్ కప్ సాధించిన జట్లలో వెస్టిండీస్ తో కలిసి భారత్ రెండవ స్థానంలో కొనసాగుతోంది. వెస్టిండీస్ 1975, 1979లో వన్డే వరల్డ్ కప్ లు గెలుచుకుంది. 1983లో టీమ్ ఇండియా వెస్టిండీస్ ఓడించి తొలిసారి వన్డే వరల్డ్ కప్ దక్కించుకుంది. 2011లో శ్రీలంకను ఓడించి టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది.. టీమిండియా, వెస్టిండీస్ తర్వాత స్థానాలలో పాకిస్తాన్ (1992), శ్రీలంక (1996), ఇంగ్లాండ్ (1999) కొనసాగుతున్నాయి. వాస్తవానికి టి20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా ఆశించినంత స్థాయిలో ప్రదర్శన చేయలేదు.. కీలకమైన సమయంలో ఆ జట్టు చేతులెత్తేస్తుంది. అదే సమయంలో వన్డే వరల్డ్ కప్ విషయానికి వచ్చేసరికి సమష్టిగా ఆడుతుంది.