https://oktelugu.com/

Kalki Movie: ‘కల్కి’ సినిమాకు, శోబితా ధూళిపాళ్లకు సంబంధం ఏంటి? ఈ పిక్ ను ఎందుకు పెట్టారు?

Kalki Movie: దీపికా పదుకునే హీరోయిన్ కు ఓ తెలుగు హీరోయిన్ డబ్బింగ్ చెప్పిందట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో చెప్పారు. ఇంతకీ ఆమె ఎవరంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : July 2, 2024 / 05:40 PM IST

    Sobhita Dhulipala Did Telugu Dubbing For Deepika Padukone In Kalki Movie

    Follow us on

    Kalki Movie: ప్రభాస్ నటించిన ‘కల్కి ఏడీ 2898’ పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతుంది. ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఈ మూవీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయిన 5 రోజుల్లో రూ.635 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. దీంతో సినిమా పెట్టుబడి రిటర్న్స్ వచ్చాయన్న చర్చ సాగుతోంది. ఇక ఇందులో దీపికా పదుకునే హీరోయిన్ కు ఓ తెలుగు హీరోయిన్ డబ్బింగ్ చెప్పిందట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో చెప్పారు. ఇంతకీ ఆమె ఎవరంటే?

    ‘కల్కి ఏడీ 2898’ మూవీలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశాపటానీ, కమలాసన్, పలువులు సీనియర్ నటులు కనిపించారు. అయితే వీరిలో దీపికా పదుకునే పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. అప్పటి వరకు గ్లామరస్ గా కనిపించిన దీపికా పదుకునే ఇందులో డీ గ్లామర్ పాత్ర పోషించింది. అయితే తెలుగులో దీపికా పదుకునే మాట్లాడే విధానం అందరికీ నచ్చుతుది. తెలుగులో ఆమెకు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా?

    తెలుగులో దీపికా పదుకునే కు డబ్బింగ్ చెప్పింది శోభితా ధూళిపాళ్ల. ఈమె పలు తెలుగు సినిమాల్లో నటించింది. గూఢాచారి, మేజర్ వంటి సినిమాలతో శోభిత ఫేమస్ అయింది. ఆ తరువాత ఓ హాలీవుడ్ సినిమాలోనూ కనిపించింది. అయితే లేటేస్టుగా శోబితా ధూళిపాళ్ల తాను దీపికా పదుకునే కు డబ్బింగ్ చెప్పినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. థియేటర్లో ఆమె పేరు రాగానే దానిని ఫొటో తీసి పోస్టు చేశారు.

    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్న కల్కి సినిమాలో తాను ఒక భాగం అయినందుకు ఎంతో సంతోషిస్తున్నానని ఈ సందర్భంగా పేర్కొంది. తన పేరుతో ఉన్న పిక్ కు లవ్ సింబల్ పెట్టి ఆ పిక్ ను తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేయడంతో ఈ పిక్ వైరల్ గా మారింది.

    Shobhita Insta Pic