Priyanka Chopra
Priyanka Chopra : విరాట్ కోహ్లీ నుంచి మొదలుపెడితే ఎంతో మంది కెప్టెన్లు వచ్చినప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాత మారడం లేదు. గత సీజన్లో వరుస ఓటములతో డీలా పడిన బెంగళూరు.. ఆ తర్వాత విజయాలు సాధించి ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది. కానీ ఒత్తిడిలో గెలవలేకపోయింది. గత సీజన్లో బెంగళూరు జట్టుకు డూ ప్లెసిస్ కెప్టెన్ గా ఉన్నాడు. బెంగళూరు జట్టు తరుపున విరాట్ కోహ్లీ అత్యధికంగా పరుగులు చేశాడు. ఏకంగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇవేవీ కూడా బెంగళూరు జట్టుకు ట్రోఫీని అందించలేకపోయాయి. దీంతో గత ఏడాది జరిగిన మెగా వేలంలో కెప్టెన్ డూ ప్లెసిస్ ను బెంగళూరు జట్టు యాజమాన్యం వద్దనుకుంది. రిటైన్ లో కూడా అతడిని వదిలేసుకుంది. జట్టుకు భారంగా మాక్స్ వెల్ ను పక్కన పెట్టింది. సాల్ట్ వంటి ఆటగాళ్లతో బలోపేతం చేసుకుంది. కొత్త కెప్టెన్ గా రజత్ పాటిదార్ ను నియమించుకుంది. అంతేకాదు 18 ఎడిషన్లో ప్రారంభ మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్(KKR vs RCB) ని వారి సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్ లో ఓడించింది. తద్వారా ఐపీఎల్ 18వ ఎడిషన్ లో సానుకూల ఫలితాన్ని సొంతం చేసుకొని.. అభిమానుల్లో అంచనాలు పెంచింది. ప్రస్తుతం బెంగళూరు జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది. ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని బలంగా కోరుకొని.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. తదుపరి మ్యాచ్లలో బెంగళూరు ఎలా ఆడుతుందనేది పక్కన పెడితే.. ఇప్పటివరకు అయితే అభిమానుల అంచనాలను అందుకునే దిశగానే బెంగళూరు తన ప్రయాణాన్ని సాగిస్తోంది.
Also Read : ఆస్తులు అమ్ముకుంటున్న SSMB 29 హీరోయిన్! రాజమౌళితో మూవీ చేస్తూ ఎందుకు ఇలా?
ప్రియాంక చోప్రా కోరుకున్నప్పటికీ…
బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకోవాలనేది సగటు కన్నడ అభిమాని కోరిక. అనేక సందర్భాల్లో బెంగళూరు జట్టు ఫైనల్ వెళ్లినప్పటికీ.. ఒత్తిడిని జయించలేక ఓటమిపాలైంది . ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో స్మృతి మందాన నాయకత్వంలోని బెంగళూరు జట్టు ట్రోఫీని అందుకుంది. కానీ ఆ ఘనతను బెంగళూరు పురుషుల జట్టు సాధించలేకపోయింది. అయితే బెంగళూరు జట్టు విజేతగా నిలవాలని సగటు కన్నడ అభిమాని మాత్రమే కాదు.. బాలీవుడ్ సీనియర్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కూడా కోరుకుంది. కాకపోతే ఇది నిజ జీవితంలో కాదు.. అప్పట్లో శీతల పానీయాల సంస్థ పెప్సీ రూపొందించిన వాణిజ్య ప్రకటనలో ప్రియాంక చోప్రా నటించింది. అందులో చెన్నై సూపర్ కింగ్స్ నామాన్ని జపించే ప్రియాంక చోప్రా.. గేల్(universal Boss Chris Gayle) పెప్సీ(Pepsi) బాటిల్ అందించగానే బెంగళూరు జట్టుకు జై కొడుతుంది. అప్పట్లో ఈ యాడ్ సంచలనంగా ఉండేది. కానీ ప్రియాంక చోప్రా కోరుకున్నప్పటికీ బెంగళూరు జట్టు ఆ సీజన్లోనే కాదు.. ఇంతవరకు జరిగిన 17 సీజన్లలోనూ విజయం సాధించలేకపోయింది. మరి ఇప్పటికైనా బెంగళూరు జట్టు ఈ సీజన్లో గెలుస్తుందా? సగటు కన్నడ అభిమాని కలను నెరవేర్చుతుందా? రజత్ పాటిదర్(Rajat Patidar) ఆధ్వర్యంలో బెంగళూరు విజయం సాధిస్తుందా? కొద్దిరోజులు గడిస్తే ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది.