Mahesh Babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఎన్ని సినిమాలు చేసిన వాళ్లకు సరైన గుర్తింపును అయితే రావడం లేదు. అందుకే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు చాలా మంది హీరోలు సరైన సక్సెస్ లను సాధించలేకపోతున్నారు…ఇక టాప్ హీరోలైతే వరుసగా సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు…
దర్శక ధీరుడిగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో యావత్ ప్రపంచ ప్రేక్షకులందరిని ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటు ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఆమెతో పాటు మరొక హీరోయిన్ కి కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందట. మరి ఆమె ఎవరు అనే విషయాల మీదనే ఇప్పుడు సరైన క్లారిటీ అయితే రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేరు ప్రకారం అలియా భట్ కి మరోసారి ఈ సినిమాలో నటించే అవకాశాన్ని ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాలో ఆమె చేసిన చాలా సీన్స్ ని తీసేసిన రాజమౌళి ఆమెకు తగ్గ గుర్తింపు అయితే రాలేదనే చెప్పాలి. దాంతో పాటుగా ఆమె కూడా రాజమౌళి మీద కొంతవరకు కోపంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ కోపాన్ని తగ్గించడానికి ఆలియాభట్ ను ఈ సినిమాలో తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
Also Read : పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్ మూవీ…డైరెక్టర్ ఎవరంటే..?
ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో మహేష్ బాబు డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ లెవెల్ కి దూసుకెళ్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
తద్వారా ఆయనకు ఈ సినిమా వల్ల చాలా అవార్డులు కూడా దక్కే అవకాశాలైతే ఉన్నాయి. మహేష్ బాబు మొదటి సారి తెలుగు సినిమా ఇండస్ట్రీని దాటి ఇండియాను దాటి పాను వరల్డ్ లో చేస్తున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం… తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
తన నటనలో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించడానికి సైతం తను సిద్ధంగా ఉన్నాడు…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబుకి ఉన్న గుర్తింపు చాలా ఎక్కువనే చెప్పాలి. ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు పోటీ పడుతున్నారు…
Also Read : నిర్మాతల కోసం మహేష్ బాబు సంచలన నిర్ణయం..దేశంలో ఇలా ఎవ్వరూ చేసుండరు!