Prithvi Bigg Boss: ఇండియా లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు ఎంజాయ్ చేయదగ్గ రియాలిటీ షో ఏదైనా ఉందా అంటే, అది బిగ్ బాస్(Bigg Boss 8 Telugu) అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా సాగే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కి మన తెలుగు లో కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. 8 సీజన్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ షో, ఈ ఏడాది సెప్టెంబర్ లో 9 వ సీజన్ తో మన ముందుకు రాబోతుంది. ఈ సీజన్ ని కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ప్రేక్షకులకు ముఖ పరిచయం ఉన్న సెలబ్రిటీస్ నే ఈసారి దింపబోతున్నారట. ఇదంతా పక్కన పెడితే ఈ బిగ్ బాస్ రియాలిటీ షో పై చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయి.
ఆ అనుమానాలు ఏమిటంటే ఇదొక రియాలిటీ షో కాదని, స్క్రిప్టెడ్ షో అని, ముందుగా ప్లాన్ చేసుకునే లోపల అన్ని చేస్తారని, ఇలా ఒక్కటా రెండా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. గత సీజన్ లో 13 వారాలు హౌస్ లో కొనసాగిన పృథ్వీ రాజ్(Prithviraj Shetty) నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. పృథ్వీ ఎప్పుడూ నిజాలు మాట్లాడుతాడు, నిజాయితీగా ఉంటాడు అని బిగ్ బాస్ షో ద్వారా మంచి పేరొచ్చింది. బిగ్ బాస్ షోలో ఎలా అయితే ఉన్నాడో, బయటకి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. రీసెంట్ గా పాల్గొన్న ఇంటర్వ్యూ లో పృథ్వీ ని బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షోనా అని అడిగితే, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘అసలు కాదు..నన్ను స్టేజి మీదకు తీసుకొని వచ్చేటప్పుడు కూడా మాస్క్ వేసి తీసుకొచ్చారు. అంటే స్టేజి ఎక్కడ ఉంది అనేది కూడా తెలీకుండా చేసారు. అంత రియాలిటీ గా ఆ షో ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నాకు కూడా బయట నుండి చూసినప్పుడు అలాగే అనిపించింది. అందరు కోడి గుడ్ల కోసం కొట్టుకుంటూ ఉంటే, అవసరమా ఇంత?, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే నేను లోపలకు వెళ్లానో, అక్కడి పరిస్థితులు నాకు అప్పుడు అర్థం అయ్యాయి. అక్కడ ఏది కూడా ప్లాన్ చేసినట్టు ఉండదు. అన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. హౌస్ లో మా మధ్య జరిగే గొడవలను చూసి బయట ఆడియన్స్ మమ్మల్ని శత్రువులు అని అనుకోవచ్చు. కానీ అక్కడ అంత సీన్ లేదు, కేవలం ఆ సందర్భంలో అలా గొడవలు జరుగుతుంటాయి అంతే. నాకు ఆత్మగౌరవం ఎక్కువ, దానిని ఎవరైనా ట్రిగ్గర్ చేస్తే గొడవలు అవుతాయి’ అంటూ చెప్పుకొచ్చాడు పృథ్వీ. అదే విధంగా విష్ణు ప్రియా ని ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని అడగగా, విష్ణు ప్రియ(Vishnu Priya) ఇంకో ఏడాది లో పెళ్లి చేసుకోవచ్చు, నాకు ఇంకా కాస్త సమయం పడుతుంది అని చెప్పుకొచ్చాడు. అంటే మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదా అని అడిగితే దానికి నవ్వుతూ అది సాధ్యం కాదు అంటూ సమాధానం చెప్పాడు.