IND Vs PAK Champions Trophy 2025
IND Vs PAK Champions Trophy 2025: ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్(IND vs PAK)మధ్య వన్డే మ్యాచ్ మొదలైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో(ICC Champions trophy 2025) భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో భారత్ పాకిస్థాన్ మధ్య లీగ్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్ టాస్ గెలిచాడు. మరో మాటకు తావు లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లోనూ టాస్ ఓడిపోయాడు. ఇటీవలి బంగ్లాదేశ్ మ్యాచ్ లోనూ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. ఆ మ్యాచ్లో టాస్ నెగిన బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా బౌలర్లు 77 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టినప్పటికీ.. ఆ తర్వాత ఆరో వికెట్ భాగస్వామ్యానికి బంగ్లాదేశ్ ఆటగాళ్లు జాకిర్ అలీ, హృదయ్ 150 కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీమిండియా ఎదుట 221 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచారు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని సాధించింది. టీమిండి ఆటగాళ్లలో గిల్ సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. చెప్పండి రోహిత్ శర్మ వేగంగా ఆడినప్పటికీ హాఫ్ సెంచరీ ముంగిట అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో బోణి చేసింది.
ఈ మ్యాచ్ లోనూ..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్ జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లోనూ టాస్ ఓడిపోయాడు. టీమిండియా కెప్టెన్ వరుసగా టాస్ ఓడిపోవడం ఇది 12వసారి.. 2023 నవంబర్ నుంచి ఫిబ్రవరి 2025 ( ఇప్పటివరకు) ఐసీసీ నిర్వహించిన ప్రతి టోర్నీలోనూ రోహిత్ శర్మ టాస్ ఓడిపోతూనే ఉన్నాడు. ముఖ్యంగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడం ద్వారా.. టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా భారీ స్కోర్ చేయలేకపోయింది. పైగా అహ్మదాబాద్ మైదానం టర్న్ కావడంతో టీమిండియా ఆటగాళ్లు భారీ స్కోర్ చేయలేకపోయారు. ఆ తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు సులువుగానే లక్ష్యాన్ని చేదించింది. ఫలితంగా టీమిండియా కు వన్డే వరల్డ్ కప్ దక్కకుండా చేసింది. ఇక టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో రోహిత్ టాస్ ఓడి పోయినప్పటికీ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది . అయితే చేజింగ్లో దక్షిణాఫ్రికా జట్టు విఫలం కావడంతో భారత్ విజేతగా నిలిచింది . ఇక ఇటీవలి బంగ్లాదేశ్ మ్యాచ్లో రోహిత్ టాస్ ఓడిపోవడం ద్వారా ముందుగా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ టీమిండియా ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేసి విజయం సాధించారు. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లోనూ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. పాకిస్తాన్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ కథనం రాసే సమయానికి పాకిస్తాన్ ఐదు పరుగులు చేసింది. ఇమామ్ (1), బాబర్ అజాం(0) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. తొలి ఓవర్ వేసిన మహమ్మద్ షమీ నాలుగు వైడ్లు వేయడం విశేషం.