Akkineni Akhil: సౌత్ ఇండియా లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న టాప్ 3 మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో తమన్(SS Thaman) ముందు వరుసలో ఉంటాడు. మణిశర్మ వద్ద శిష్యరికం చేసి, కీ బోర్డు ప్లేయర్ గా కెరీర్ ని ప్రారంభించిన తమన్, నేడు ఏకకాలం లో అరడజను సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. అసలు ఇతను నిద్ర పోతాడా అంటే అనుమానమే. అంత బిజీ గా గడుపుతూ ఉంటాడు. 24 గంటలు యంత్రం లాగా పని చేస్తూ ఉండే తమన్, రిలాక్స్ సమయం లో క్రికెట్ ఆడడం హాబీ గా మార్చుకున్నాడు. ప్రతీ రోజు ఎదో ఒక సమయంలో క్రికెట్ ఆడాల్సిందే. లేకపోతే ఆయన దినచర్య పూర్తి అవ్వదట. అలాంటి తమన్ ఇప్పుడు తెలుగు వారియర్స్ టీం లో కీలకమైన ప్లేయర్ గా నిలిచాడు. ప్రతీ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే CCL క్రికెట్ మ్యాచులు ఈ ఏడాది కూడా మొదలైంది.
ఇటీవల జరిగిన ఒక మ్యాచ్ లో తమన్ బ్యాటింగ్ లోనూ, ఫీల్డింగ్ లోనూ తన విశ్వరూపం చూపించేసాడు. కీలకమైన సమయంలో ఆయన ఒక సిక్స్ కొట్టాడు, అదే విధంగా టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక కీలక వికెట్ తీసి గెలుపు అవకాశాలు పెంచాడు. తెలుగు వారియర్స్ టీం లో నాగార్జున చిన్న తనయుడు అక్కినేని అఖిల్(Akkineni Akhil) కూడా ఉన్నాడు. తమన్ క్యాచ్ పట్టుకోగానే గ్రౌండ్ మొత్తం తిరుగుతూ సంబరాలు చేయగా, అఖిల్ కూడా అతన్ని హత్తుకొని శుభాకాంక్షలు తెలియచేసాడు. ఆ క్రమంలో అఖిల్ చూసుకోకుండా తమన్ ని ఎగిరి కాళ్లతో కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో పై నెటిజెన్స్ అనేక ఫన్నీ మీమ్స్ ని క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఆ వీడియో ని మీరు కూడా ఆర్టికల్ చివర్లో చూసేయండి. సరిగ్గా 35 వ సెకండ్ వద్ద మనం ఆ షాట్ ని చూడొచ్చు.
ఇది ఇలా ఉండగా తమన్ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘గేమ్ చేంజర్'(Gamechanger Movie), ‘డాకు మహారాజ్’ చిత్రాలకు మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. వీటిలో ముఖ్యంగా డాకు మహారాజ్ కి ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. కొన్ని థియేటర్స్ లో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ కెపాసిటీ ని తట్టుకోలేక డీటీఎస్ బాక్సులు బ్లాస్ట్ అయిపోయిన సందర్భాలను కూడా మనం చాలానే చూసాము. ఇక ఓటీటీ లో విడుదల అయ్యాక కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఆయన చేతిలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘ఓజీ’, ప్రభాస్ ‘రాజా సాబ్’, బాలకృష్ణ ‘అఖండ 2’ చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు పలు చిన్న సినిమాలకు కూడా అయన సంగీతం అందించడానికి ఒప్పుకున్నాడు. రాబోయే రోజుల్లో తమన్ రేంజ్ ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
asla @MusicThaman Anna okasari Balayya garu ala vachi ala vellaru ga fire ❤️❤️❤️❤️❤️❤️❤️❤️,
“నరుకుతూ పోతుంటే నీకు అలుపు వస్తుందేమో. నాకు మాత్రం ఊపు వస్తుంది.”- nandamuri thaman
what a match asala sixes, last lo a catch and celebrations #teluguwarriors #ccl25 #Thaman… pic.twitter.com/ow1SiGzztN
— Ashwatthama (@Ashwatthama2898) February 21, 2025