Prabhsimran Singh: ఐపీఎల్ లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న ఆటగాళ్ల జాబితాలో పంజాబ్ ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ కు అగ్రస్థానం ఉంటుంది. ఎందుకంటే పంజాబ్ జట్టు తరఫున అతడు భీకరమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఓపెనర్ గా వచ్చి నిలకడైన ఆట తీరు ప్రదర్శిస్తూ భారీగా పరుగులు చేస్తున్నాడు. ఇటీవల లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఒకానొక దశలో సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ 9 పరుగుల తేడాతో అతడు సెంచరీ కోల్పోయాడు. అయినప్పటికీ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి పంజాబ్ అభిమానులు మాత్రమే కాదు.. ఐపీఎల్ అభిమానులను అలరించాడు. పంజాబ్ జట్టు సాధించిన విజయంలో కీలక పాత్ర పోషించాడు. జట్టు కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో గెలిపించి చూపించాడు.
Also Read: విజయవాడ టు విశాఖ.. జూన్ 1 నుంచి విమాన సేవలు!
గుండెలను తాకే కథ
ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఆ స్థాయిలో బ్యాటింగ్ చేయడం వెనుక గుండెలను తాకే కథ ఉంది. ఎందుకంటే ప్రభ్ సిమ్రాన్ సింగ్ తండ్రి పేరు సర్దార్ సూర్జిత్ సింగ్. ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ప్రభ్ సిమ్రాన్ సింగ్ దూకుడుగా ఆడుతున్నంత సేపు మాత్రం ఆయన నవ్వుతున్నారు. తన బాధను పూర్తిగా మర్చిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు.ప్రభ్ సిమ్రాన్ సింగ్ విఫలమైన మ్యాచ్లలో నిర్వేదంలో ఉంటున్నారు. కంటిమీద రెప్ప కూడా వేయడం లేదు. అందువల్లే తన తండ్రిని సంతోష పరచడానికి.. ఆయన ఆనందంగా నవ్వుతూ ఉండడానికి ప్రభ్ సిమ్రాన్ సింగ్ స్థిరమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. పంజాబ్ జట్టు తరుపున ఓపెనర్ గా ఆడుతున్న ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లలో 437 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇతడి హైయెస్ట్ స్కోర్ 91, యావరేజ్ 39.73, స్ట్రైక్ రేట్ 170.04. ఇక ఈ సీజన్లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ 45 ఫోర్లు కొట్టాడు.. 24 సిక్సర్లు బాదాడు.. తన తండ్రి ఆనందం కోసమే ప్రభ్ సిమ్రాన్ సింగ్ దూకుడుగా ఆడుతున్నట్టు జాతీయ మీడియా చెబుతోంది.. తన తండ్రి సంతోషం కోసం ప్రభ్ సిమ్రాన్ సింగ్ క్లిష్టమైన బౌలర్లను కూడా ఎదుర్కొంటున్నాడని.. తనకు తాను బలంగా నిర్దేశించుకుని బ్యాటింగ్ చేస్తున్నాడని జాతీయ మీడియా తన ప్రచారం చేసిన కథనాలలో పేర్కొంటున్నది. ” సిమ్రాన్ సింగ్ ఆట తీరు చూసి ఆయన తండ్రి ఎంతో సంతోషిస్తున్నాడు. అతని దూకుడైన బ్యాటింగ్ ఆయనను ఆనందింపజేస్తున్నది. ఇది ఒకరకంగా మాకు సంతోషకరమైన వార్త అని” సిమ్రాన్ సింగ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Also Read: పాకిస్థాన్‌పై దాడికి భారత్ వ్యూహం.. కీలక స్థావరం గుర్తింపు!