Homeక్రీడలుక్రికెట్‌Champions Trophy 2025 : నెత్తి మాసిన పాకిస్తాన్..భారత్ పై ఎప్పుడూ ద్వేషమే.. చాంపియన్స్ ట్రోఫీలోనూ...

Champions Trophy 2025 : నెత్తి మాసిన పాకిస్తాన్..భారత్ పై ఎప్పుడూ ద్వేషమే.. చాంపియన్స్ ట్రోఫీలోనూ వివక్షే! మండిపడుతున్న నెటిజన్లు..

Champions trophy 2025 : ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఈసారి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. భద్రతా కారణాలవల్ల భారత్ దుబాయిలో ఆడుతోంది. భారత్ కోరిక మేరకు ఐసిసి కోడ్ హైబ్రిడ్ మోడ్ లో ఈ టోర్నీ నిర్వహిస్తోంది. భారత్ పాకిస్తాన్ వెళ్లకపోవడంతో దాయాది దేశం తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ దిక్కుమాలిన పని చేసింది. అది నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతోంది. పాకిస్తాన్లోని కరాచీలో నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది. ఆ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న 8 దేశాలలో ఏడు దేశాల జెండాలు మాత్రమే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రదర్శనగా ఉంచింది. భారత జాతీయ పతాకాన్ని మాత్రం ప్రదర్శించడానికి ఒప్పుకోలేదు.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇతర దేశాల జెండాలు కరాచీ నేషనల్ స్టేడియంలో కనిపించాయి. భారత జాతీయ పతాకం మాత్రం ఇందులో కనిపించలేదు. కరాచీ స్టేడియంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. దీంతో నెటిజన్లు పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ భారత్ పై ఎప్పటికీ విషం చిమ్ముతూనే ఉంటుందని.. తాజాగా తన వక్ర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కచ్చితమైన కారణం లేదు

కరాచీ నేషనల్ స్టేడియంలో భారత జెండా లేకపోవడం వెనుక కచ్చితమైన కారణం ఇంతవరకు తెలియ రాలేదు. అయితే భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ లను దుబాయ్ వేదిక ఆడుతుంది. అందువల్లే పాకిస్తాన్ భారత జాతీయ జెండాను కరాచీ నేషనల్ స్టేడియంలో ఎగరవేసి ఉండకపోవచ్చు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.. కరాచీ స్టేడియంలో పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్ లకు ఆతిథ్యం ఇస్తుంది.. ఐసీసీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న ఛాంపియన్ ట్రోఫీ మొదలవుతుంది. ఈ ట్రోఫీలో మొత్తం ఎనిమిది దేశాలు ఆడుతున్నాయి. ఇవన్నీ కూడా రెండు గ్రూపులుగా పోటీ పడతాయి. రెండు గ్రూపులలో టాప్ -2 కేటగిరిలో నిలిచిన జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్ లో గెలిచిన చెట్లు ఫైనల్ వెళ్తాయి. లీగ్ దశలో ప్రతి జట్టు కూడా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. టీ మీడియా ఈనెల 20న బంగ్లాదేశ్, 23న పాకిస్తాన్, మార్చి 1న న్యూజిలాండ్ జట్లతో తన లీగ్ మ్యాచ్లు ఆడుతుంది.. అయితే బంగ్లాదేశ్ పై భారత విజయం లాంచనమే అయినప్పటికీ.. పాకిస్తాన్, న్యూజిలాండ్ నుంచే టఫ్ ఫైట్ ఎదురుకానుంది. 2023 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఈ రెండు జట్లపై భారత్ విజయాలు సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో భారత్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. అయితే ఈసారి ఆ తప్పును కంటిన్యూ చేయకుండా.. మెరుగైన ఆట తీరు ప్రదర్శించాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఇందులో భాగంగానే ముమ్మరంగా దుబాయిలో సాధన చేస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version