Pawan Kalyan Hari Hara Veeramallu
Hari Hara Veeramallu : ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) సినిమా వస్తుందంటే విపరీతమైన క్రేజ్ అయితే ఉండేది. ఇక ఆయన రాజకీయ రంగం వైపు వెళ్లిపోవడంతో అడపా దడపా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న మూడు సినిమాలను తొందరగా ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యం లో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి తోడుగా మార్చి 28వ తేదీన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమాని రిలీజ్ చేస్తామంటూ ప్రొడ్యూసర్స్ డేట్స్ ని అయితే అనౌన్స్ చేశారు. రిలీజ్ కి మహా అయితే ఇంకో 40 రోజుల సమయం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. మరి ఇంత తక్కువ వ్యవధిలో బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ పూర్తయిపోతుందా? పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేస్తారా? సెన్సార్ ఏ ఇబ్బంది లేకుండా క్లియర్ అవుతాయా? అసలు హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటి? అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు… ఈ సినిమా మీద అసలు ప్రేక్షకుల్లో బజ్ అయితే లేదు. ఒకప్పుడు క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుందని చెప్పినప్పుడు మంచి అంచనాలు ఉండేవి. ఇక రోజు రోజుకి లేట్ అవుతూ ఉండడంతో క్రిష్ (Krish) ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా మీద బజ్ అయితే తగ్గిపోయింది. మరి ఎలాగైనా సరే ఈ సినిమాకి భారీ ప్రమోషన్స్ చేసి బజ్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మాత్రం పవన్ కళ్యాణ్ మీదే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఉన్నాడు అంటే సినిమాకి భారీ హైప్ అయితే వస్తుంది. మరి ఇప్పుడు ఏ ప్రమోషన్స్ లేకుండా సినిమాని రిలీజ్ చేస్తే మాత్రం ప్రొడ్యూసర్స్ కి భారీ నష్టాలు వస్తాయి. దాదాపు ఈ సినిమా స్టార్ట్ అయి నాలుగు సంవత్సరాలు అవుతుంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఏ ఏం రత్నం ఇక వేరే సినిమాలు ఏమీ చేయకుండా ఈ ఒక్క సినిమా మీద స్టిక్ అయిపోయి ఉన్నాడు. మరి ఈ సినిమా అంతకంతకు లేట్ అవుతుండడంతో ఆయనకు ఫైనాన్సియర్స్ నుంచి ఇబ్బందులైతే ఎదురవుతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్ భారీ లెవల్లో రావాలి. ఎంతలా అంటే తీసుకున్న డబ్బులకు నాలుగు సంవత్సరాల నుంచి వడ్డీతో సహా వసూలు చేయాల్సిన అవసరమైతే ఉంది. కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ చేయాలంటే మాత్రం అది పవన్ కళ్యాణ్ వల్లే అవుతుంది. మరి ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ని సాధిస్తాడా? తద్వారా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…