Site icon OkTelugu

Allu Arjun Brother Death Reason: అల్లు అర్జున్ వాళ్ల బ్రదర్ చనిపోవడానికి కారణం ఎవరో తెలుసా..?

Allu Arjun Brother Death Reason

Allu Arjun Brother Death Reason

Allu Arjun Brother Death Reason: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రగామి ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నిర్మాత అల్లు అరవింద్…ఎన్నో సినిమా కథలను అంచనా వేసి వాటిని విజయ తీరాలకు చేర్చడంలో ఆయన కీలక పాత్ర వహించాడు. ఆయనకి వెంకటేష్,అర్జున్, శిరీష్ అనే ముగ్గురు కొడుకులు ఉన్నారనే విషయం మాత్రమే మనకు తెలుసు…కానీ తనకు మరో కొడుకు కూడా ఉన్నాడనే విషయం చాలామందికి తెలియదు. వెంకటేష్ తర్వాత రాజేష్, అల్లు అర్జున్, శిరీష్ జన్మించారు… రాజేష్ తన చిన్నతనంలోనే అనుకోకుండా ఒక యాక్సిడెంట్ లో మరణించాడు. దాంతో వల్ల కుటుంబ సభ్యులు చాలావరకు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఇదంతా అల్లు అర్జున్ చిన్నతనంలోనే జరిగింది. రాజేష్ చనిపోవడానికి గల కారణం ఎవరు అంటే దానికి అల్లు అరవింద్ తనే అని చెబుతుంటాడు. అనుకోని కారణాల వల్ల తన నిర్లక్ష్యం వల్లే తన కొడుకు యాక్సిడెంట్ కి గురయ్యాడు అంటూ ఆయన పలు సందర్భాల్లో తెలియజేశాడు. అల్లు అరవింద్ కొడుకు అయిన అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టార్ హీరో అయ్యాడు మనందరికి తెలుసు…

Also Read: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ బాలీవుడ్ స్టార్ నేను నీ సినిమాలో చేస్తాను బన్నీ అని అడిగాడా..?

వెంకటేష్ సైతం ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా మారుతున్నాడు. శిరీష్ అడపదడపా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. రాజేష్ సైతం ఉండి ఉంటే తను కూడా హీరోగా మారేవాడని తనకి చిన్నతనంలోనే సినిమాలంటే చాలా ఇష్టమని చెబుతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ తన చిన్నతనంలోనే తన బ్రదర్ ను కోల్పోవడం అనేది నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురి చేసే విషయమనే చెప్పాలి… అరవింద్ సైతం ఈ విషయాన్ని తలచుకున్న ప్రతిసారి చాలా ఎమోషనల్ అవుతుంటాడు. ఈ విషయాన్ని ఎక్కువ సార్లు గుర్తు చేసుకోవడానికి ఇష్టపడరు…

ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ మాత్రం అల్లు ఫ్యామిలీ స్థాయిని పెంచుతున్నాడు. ‘పుష్ప 2’ సినిమాతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన ఇప్పుడు అట్లీ తో చేస్తున్న మరో సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…

Exit mobile version