New Ration Cards
New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్‌కార్డు జారీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జనవరి 26(January 26) నుంచి కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే అధికారులు మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో ఉండడం, కొత్త కార్డుల జారీ ప్రక్రియపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. మరోవైపు కోడ్ అమలులోకి రావడంతో జారీ చేయాలా వద్దా అన్న సందిగ్ధంతో కూడా జారీ ప్రక్రియ మందగించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్ చెప్పారు. కార్డుల జారీలో జాప్యం చేయొద్దని ఆదేశించారు. అర్హులందరికీ కార్డులు జారీ చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లో కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. లబ్ధిదారులు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయకుండా అవగాహన కల్పించాలని తెలిపారు.
డిజైన్ల పరిశీలన..
ఇదిలా ఉంటే.. కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పలు డిజైన్లను(Degins) పరిశీలించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకవైపు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. దీంతో మీసేవ(Me seva) కేంద్రాలకు జనం క్యూ కడుతున్నారు. దీంతో నాలుగు రోజులుగా మీసేవ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఇదే అదనుగా మీసేవ కేంద్రాల నిర్వాహకులు రెట్టింపు చార్జీ వసూలు చేస్తున్నారు. ప్రజాపాన(Prajapalana)లో దరఖాస్తు చేసుకున్నా తమ పేరు జాబితాలో రాలేదని పలువురు మీసేవ కేంద్రాల చుట్టూ తిరిగుతున్నారు. ఇలాంటి వారికి అధికారులు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.
వారు దరఖాస్తు చేసుకోవద్దు..
రేషన్ కార్డుల కోసం ఇప్పటికే ప్రజాపాలన, ప్రజావాణి(Prajavani)లో దరఖాస్తులు ఇచ్చినవారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదు. వారి దరఖాస్తులు ఇప్పటికే ప్రాసెస్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్టంలో కొత్తగా 6.68 లక్షల పేదలకు కార్డులు(Retion Cards) జారీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు అర్హులను గుర్తించింది. వీరి జాబితాను రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రతినిధులకు పంపించారు. ఆ కుటుంబాల జాబితాలో 11,65,052 మంది పేర్లు ఉన్నాయి.