Pat Cummins: హైదరాబాద్( sun risers Hyderabad) జట్టు ఘనవిజయం సాధించిన తర్వాత.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(pat cummins) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ” ఐపీఎల్ లో దూకుడుగా ఆడితేనే ఫలితం ఉంటుంది. మేం కూడా అలాంటి పద్ధతిని పాటిస్తున్నాం. స్థూలంగా చెప్పాలంటే పిచ్చెక్కి పిచ్చ కొట్టుడు కొట్టాలి. అదే ఐపీఎల్ లో గెలుపును అందిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ తర్వాత మా బ్యాటర్లకు బౌలింగ్ చేయడం అంటే ఇతర జట్టు బౌలర్లకు చాలా కష్టం. నేనైతే ఆ పని చేయలేను.. మా ప్లేయర్లు అద్భుతంగా ఆడారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సర్లతో దూకుడుగా ఆడారు. ఆ సమయంలో మా బ్యాటర్లకు రాజస్థాన్ బౌలర్లు మాత్రమే కాదు.. ఇతర జట్ల బౌలర్లు కూడా బౌలింగ్ వేయాలంటే కష్టమే. వారికి నేను కూడా బౌలింగ్ చేయలేను. బౌలింగ్ చేసి ఇబ్బంది పడలేను. అలాంటి గణాంకాలు ఎలాంటి బౌలర్ కైనా ఇబ్బంది కలిగిస్తాయని” కమిన్స్ వ్యాఖ్యానించాడు.
Also Read: తెలుగోడు నిలబడకపోయి ఉంటే ముంబై ఇజ్జత్ మొత్తం పోయేది..
280కి మించి..
” ఐపీఎల్ లో 280 పరులు చేయడం కష్ట సాధ్యమైన విషయం. కానీ మా ఆటగాళ్ల బ్యాటింగ్ అసాధారణం. అనితర సాధ్యం. అలాంటి ఆటగాళ్లకు బౌలింగ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్క ఓవర్ కట్టడిగా వేయాలంటే కూడా కష్టంగా ఉంటుంది. బంతులు గాల్లో తేలుతూ వెళుతుంటే బౌలర్లు మాత్రం ఏం చేస్తారు.. హెడ్(Travis Head) బీభత్సం అనుకుంటే..ఇప్పుడు అతడికి ఇషాన్ కిషన్(Ishan kishan) తోడయ్యాడు. వీరిద్దరూ అగ్నికి ఆయువుతోడైనట్టు బ్యాటింగ్ చేస్తున్నారు. ఆదివారం జరిగింది కూడా అదే.. ఈ సీజన్ కోసం మేము అన్ని విధాలుగా రెడీ అయ్యాం. మా కోచ్ లు కూడా మాతోటి తీవ్రంగా అ
కసరత్తులు చేస్తున్నారు. ఇది ఒక్క మ్యాచ్ తో సరిపోయేది కాదు. మిగతా మ్యాచ్ లకు మాకు ఆల్రెడీ బ్లూ ప్రింట్ రెడీ అయిందని” కమిన్స్ వ్యాఖ్యానించాడు.. ఇక ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఆటగాడు ఇషాన్ కిషన్(47 బంతుల్లో 11 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 106*) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హెడ్, క్లాసెన్ విధ్వంసం సృష్టించడంతో హైదరాబాద్ జట్టు 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ టార్గెట్ ఫినిష్ చేయడానికి రాజస్థాన్ రాయల్స్ రంగంలోకి దిగినప్పటికీ.. 242 పరుగుల వద్ద ఆగిపోయింది. అయితే ఈ మ్యాచ్లో మొత్తం 30 సిక్సర్లు, 51 ఫోర్లు నమోదు కావడం విశేషం. అంతేకాదు సొంతమైదానంపై హైదరాబాద్ జట్టు మరోసారి సత్తా చాటడంతో ఆరెంజ్ ఆర్మీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిన్న విజయం సాధించిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాల్టి వరకు సోషల్ మీడియాలో హైదరాబాద్ జట్టు టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతూ ఉండడం విశేషం.
After match scenarios
Don’t miss the ending #SunrisersHyderabad #SRHvsRR #IshanKishan #SRH pic.twitter.com/OUCNAkSLrr— T O M B O Y (@nekuendhuku007) March 24, 2025