Homeబిజినెస్ABS Technology : టీవీఎస్ అపాచీ నుంచి బజాజ్ పల్సర్ వరకు ఏబీఎస్ టెక్నాలజీలో వచ్చే...

ABS Technology : టీవీఎస్ అపాచీ నుంచి బజాజ్ పల్సర్ వరకు ఏబీఎస్ టెక్నాలజీలో వచ్చే బడ్జెట్ బైక్స్ ఇవే

ABS Technology : ఇండియాలో రూ.1.30 లక్షల బడ్జెట్‌లో కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ ధర పరిధిలో లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్ ABS ఉన్న బైక్‌లు ఏవి ఉన్నాయో తెలుసుకుందాం. ABS అంటే యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ హఠాత్తుగా బ్రేక్ వేసినప్పుడు బైక్ స్కిడ్ కాకుండా సాయపడుతుంది సింగిల్ ఛానల్ ABS సిస్టమ్‌తో వచ్చే 5 బైక్‌ల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Also Read : చేతక్ తయారీ సంస్థ బజాజ్ ఆటోకు రూ. 10 కోట్ల జరిమానా.. ఎందుకో తెలుసా ?

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 2V:
టీవీఎస్ మోటార్స్ పాపులర్ బైక్ RM డిస్క్ వేరియంట్‌లో ABS సిస్టమ్ ఉంది. ఈ వేరియంట్ ధర రూ. 1 లక్ష 24 వేల 720 (ఎక్స్-షోరూమ్). ABS తో పాటు, ఈ బైక్‌లో సేఫ్టీ కోసం రోటో పెటల్ డిస్క్ బ్రేక్ కూడా ఉంది.

యామహా FZS Fi:
యామహా కంపెనీకి చెందిన ఈ బైక్ సింగిల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ బైక్ ధర రూ. 1 లక్ష 22 వేల 900 (ఎక్స్-షోరూమ్).

హోండా SP160:
హోండా కంపెనీకి చెందిన ఈ బైక్‌లో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ABS తో పాటు, ఈ మోటార్‌సైకిల్‌లో కస్టమర్ల సేఫ్టీ కోసం 220ఎంఎం పెటల్ షేప్ రియర్ డిస్క్ బ్రేక్ ఉంది. ఈ బైక్ ధర రూ. 1 లక్ష 20 వేల 951 (ఎక్స్-షోరూమ్).

బజాజ్ పల్సర్ NS125:
బజాజ్ కంపెనీకి చెందిన పల్సర్ బైక్ కు ఎలాంటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కోసం NS125 LED BT ABS వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ మోడల్ ధర రూ. 1,06,739 (ఎక్స్-షోరూమ్). ABS తో పాటు ఈ మోటార్‌సైకిల్‌లో బ్లూటూత్ డిజిటల్ కన్సోల్ కూడా ఉంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 125R:
సింగిల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వచ్చే హీరో మోటోకార్ప్ ఈ అద్భుతమైన బైక్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, హజార్డ్ ల్యాంప్ ఉన్నాయి. ABS సిస్టమ్ వేరియంట్ ధర రూ. 1,00,100 (ఎక్స్-షోరూమ్).

ఈ బైక్‌లు అన్నీ సింగిల్ ఛానెల్ ABS తో వస్తాయి. ఈ ఫీచర్ ఉన్న బండ్లను ఎంచుకోవడం వల్ల రైడింగ్ సమయంలో రైడర్లకు అదనపు భద్రత ఉంటుంది.

Also Read : ప్రజల హృదయాలను గెలుచుకున్న మొదటి సీఎన్జీ బైక్.. ఇప్పటివరకు ఎన్ని యూనిట్లు అమ్ముడయ్యాయో తెలుసా ?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular