World Cup 2023: పాకిస్తాన్ టీం వరల్డ్ కప్ లో మొదటి రెండు మ్యాచ్ ల్లో గెలిచి అద్భుతమైన విజయాలను అందుకుంది. ఇక వరల్డ్ కప్ లో తమదైన రీతిలో పాకిస్థాన్ టీమ్ శుభారంబాన్ని ఇచ్చినప్పటికీ ఆ తర్వాత జరిగిన మ్యాచ్ ల్లో వరుసగా ఫెయిల్ అయింది. దాంతో ఇప్పుడు పాకిస్థాన్ ఫైనల్ కు వెళ్లడం అనేది చాలా కష్టతరంగా మారింది. అందులో భాగంగానే పాకిస్తాన్ టీమ్ చీఫ్ కలెక్టర్ అయిన ఇంజమమ్ ఉల్ హక్ పాకిస్తాన్ టీమ్ ఓటమికి తనే పూర్తి బాధ్యత ని వహించి తన పదవికి రాజీనామా చేయడం జరిగింది.తన రాజీనామా లేఖ ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ అయిన జాకా అష్రఫ్ కి అందజేయడం జరిగింది.
అయితే మొదట రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించిన పాకిస్తాన్ టీం ను చూసి ఇంజమమ్ ఉల్ హక్ ఈసారి పాకిస్థాన్ టీమ్ కప్పు కొడుతుంది అని చాలా కాన్ఫిడెంట్ గా ఒక స్టేట్మెంట్ ని కూడా ఇచ్చాడు. కానీ ఆయన అంచనాలను తారుమారు చేస్తూ పాకిస్తాన్ టీం వరుస ఓటమిలనూ చవి చూస్తూ వస్తుంది ఇక దీంతో ఇంజామమ్ తీవ్ర మనస్థాపానికి గురైనట్టుగా తెలుస్తుంది. దాంతో పాకిస్తాన్ టీమ్ వరుసగా ఇండియా, ఆస్ట్రేలియా,ఆఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా టీమ్ ల పైన ఓటమి పాలైంది… అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ఇందులో తెలియజేయడం జరిగింది… ఇక దీనికి ముందు కూడా పాకిస్థాన్ ఎంతో మంచి పర్ఫామెన్స్ ఇస్తుంది అనుకున్న ఆసియా కప్ లో కూడా ఫైనల్ కి వెళ్లకుండ నే లీగ్ దశలోనే నిష్క్రమించడం జరిగింది. వీటన్నింటికీ ఇంజామమ్ బాధ్యత వహిస్తున్నట్టుగా తెలియజేయడం జరిగింది…
ఇక ఇదే క్రమం లో ఇంజమామ్ ఉల్ హక్‌పై కూడా నెగిటివ్ కామెంట్లు రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్లేయర్స్ మేనేజ్‌మెంట్ కోసం రిజిస్టర్ చేయబడిన కంపెనీలో ఇంజమామ్‌కు వాటా ఉందని దానివల్లే ఆయన పీసీబీ చీఫ్ గా కొనసాగారు అని, అలాగే తనే కాకుండా ఈ కంపెనీ లో పాకిస్థాన్ స్టార్ క్రికెటర్లు అయిన బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్, షాహిన్ షా అఫ్రిది వంటి స్టార్ ఆటగాళ్లకు ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇక ఇదంతా తెలుసుకున్న అభిమానులు వీళ్ళ వ్యక్తి గత ప్రయోజనాలకోసం టీమ్ కి ద్రోహం చేస్తున్నారు అంటూ నెగిటివ్ గా కామెంట్లు చేయడం జరుగుతుంది…
ఇక ఇది ఇలా ఉంటే ఇంజమామ్ తన పదవి కి రాజీనామా చేయడంతో పీసీబీ అతనికి 15 మిలియన్ల పాకిస్థాన్ రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది ఎందుకంటే తమ పదవి కాలం ముగియక ముందే తను టీమ్ లో ఉన్న అవకతవకలు నచ్చాక తన సెలక్టర్ పదవి కి రాజీనామా చేయడంతో అది కంప్లీట్ గా పిసిబి తప్పు గా పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి తనకి తన 6 నెలల జీతంగా వచ్చే రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఇక తన కి 6 నెలల జీతం గా 15 మిలియన్లు చెల్లించాలి మరి దీనిమీద పిసిబి ఎలా స్పందిస్తుందో చూడాలి…