Salaar: సలార్ చిత్రం గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏకంగా పది రోజులు రీ షూట్ చేశారని టాలీవుడ్ టాక్. సలార్ ప్రభాస్ కెరీర్లోనే భారీ హైప్ మధ్య విడుదల కానుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 28 విడుదల తేదీగా ప్రకటించారు. అయితే విడుదల వాయిదా వేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కానీ నేపథ్యంలో వాయిదా పడిందన్న వాదన వినిపించింది.
అలాగే సలార్ విఎఫ్ఎక్స్ వర్క్ పట్ల సంతృప్తిగా లేని ప్రశాంత్ నీల్ విడుదల వాయిదా వేసి బెస్ట్ అవుట్ ఫుట్ తో రావాలని ట్రై చేస్తున్నారని మరో వాదన వినిపించింది. ఎట్టకేలకు డిసెంబర్ 22 విడుదల తేదీగా ప్రకటించారు. మరో యాభై రోజుల్లో మూవీ విడుదల కానుంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ మొదలయ్యాక సలార్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారన్న న్యూస్ కాకరేపుతుంది.
హీరో ప్రభాస్ లేకుండా ఇతర నటీనటుల మీద 10 రోజుల షూటింగ్ జరిగిందట. ఇది రెగ్యులర్ షూట్ లో భాగంగా చేశారా? లేక రీ షూట్ చేశారా? అనే సందేహాలు మొదలయ్యాయి. అసలు విడుదలకు ముందు షూటింగ్ ఏంటనే చర్చ జరుగుతుంది. ఈ పుకార్లు సలార్ మూవీపై నెగిటివిటీకి కారణం అవుతున్నాయి. ప్రభాస్ అయితే ఇండియాలో లేరు. మోకాలికి సర్జరీ చేయించుకున్న ఆయన విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ప్రభాస్ వచ్చే నెలలో ఇండియాలో అడుగుపెడతారు. సలార్ చిత్ర ప్రమోషన్స్ లో ఆయన పాల్గొనాల్సి ఉంది. సలార్ కూడా రెండు భాగాలుగా తెరకెక్కనుందట. దీనికి సీక్వెల్ ఉంటుందని అంటున్నారు. జగపతిబాబు కీలక రోల్ చేశారు. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నారు. ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. సలార్ కెజిఎఫ్ కథలో భాగమే అనే మరో వాదన కూడా ఉంది.