Homeక్రీడలుక్రికెట్‌Babar Azam : విరాట్ కంటే తోపన్నారు.. ఇప్పుడేమో జట్టు నుంచి బయటికి పంపించారు.. బాబర్...

Babar Azam : విరాట్ కంటే తోపన్నారు.. ఇప్పుడేమో జట్టు నుంచి బయటికి పంపించారు.. బాబర్ భయ్యా నువ్విక క్రికెట్ కు గుడ్ బై చెప్పడం బెటర్..

Babar Azam : ఇటీవల పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజాం తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు.. సాధారణ ఆటగాడిగా కొనసాగుతానని ప్రకటించాడు. కానీ అతడు ఆట మీద అంతగా ఆసక్తి చూపించలేదు. పైగా ఇంగ్లాండ్ జట్టుతో ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో దారుణంగా అవుట్ అయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నాకెందుకులే అన్నట్టుగా పేలవమైన షాట్ ఆడి వెనుతిరిగాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జట్టుతో అక్టోబర్ 15 నుంచి ముల్తాన్ వేదికగా జరిగే రెండవ టెస్టుకు పాకిస్తాన్ మేనేజ్మెంట్ జట్టులో సమూల మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో బాబర్ కు ఉద్వాసన పలికింది. ప్రముఖ క్రీడా వెబ్ సైట్ నివేదిక ప్రకారం అలీమ్ ధార్, అకీబ్ జావేద్, అజహర్ ఆలీతో కూడిన ఎంపిక కమిటీ బాబర్ ప్రదర్శన పట్ల అసంతృప్తితో ఉన్నది. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి తప్పించి.. యువ ఆటగాడు కమ్రాన్ గులాం కు అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అతని కథ ముగిసినట్టేనా

కొద్ది నెలలుగా బాబర్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. మూడు ఫార్మాట్ లలో అతడు సెంచరీ చేసి దాదాపు ఏడాది దాటింది. గత ఏడాది నేపాల్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్లో అతడు అంతర్జాతీయ సెంచరీ చేశాడు. ఇక టెస్టులలో అయితే బాబర్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. టెస్టులలో హాఫ్ సెంచరీ చేసి దాదాపు 24 దాటిపోయింది. 2022లో డిసెంబర్ నెలలో న్యూజిలాండ్ జట్టుపై జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్లో అతడు 161 రన్స్ చేశాడు ఇక అప్పటినుంచి అతడు కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోతున్నాడు. గత 20 నెలల్లో బాబర్ టెస్ట్ లలో సాధించిన హైయెస్ట్ స్కోర్ 41 రన్స్ అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనవరి 2023 నుంచి ఇప్పటివరకు 17 టెస్ట్ ఇన్నింగ్స్ లు ఆడిన బాబర్.. 21.33 సగటుతో కేవలం 355 రన్స్ మాత్రమే చేశాడు. ఇక ముల్తాన్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ లో దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్ లు కలిపి అతడు కేవలం 35 రౌండ్స్ మాత్రమే చేయగలిగాడు. అందువల్లే అతడిపై వేటువేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహించినట్టు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో విమర్శలు..

బాబర్ కు ఉద్వాసన పలకడం ఖాయమని తేలిన నేపథ్యంలో.. సామాజిక మాధ్యమాలలో బాబర్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సొంత దేశానికి చెందిన అభిమానులు బాబర్ పై సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ” వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయావు. చివరికి జట్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నావ్. అయినప్పటికీ నీ ఆటతీరులో మార్పు రాలేదు. ఇకపై మార్పు వస్తుందో కూడా తెలియదు. ఒకప్పుడు నిన్ను విరాట్ కంటే తోపన్నారు.. ఇప్పుడేమో జట్టు నుంచి బయటికి పంపించారు.. బాబర్ భయ్యా నువ్విక క్రికెట్ కు గుడ్ బై చెప్పడం బెటర్” అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version