Chota K Naidu Vishwambhara Graphics Controversy: టాలీవుడ్ లో టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరు చోటా కె నాయుడు. కమర్షియల్ సినిమాకు అయినా, గ్రాండియర్ సినిమాకు అయినా ఈయన ప్రతీ డైరెక్టర్ కి ఒకప్పుడు ఈయన కావాల్సి వచ్చేది. మెగాస్టార్ చిరంజీవి ‘అంజి’ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ, ఆ చిత్రం లోని గ్రాఫిక్స్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ఆ సినిమాకు సినిమాటోగ్రఫీ చేసింది ఈయనే. అదే విధంగా అక్కినేని నాగార్జున కెరీర్ లో గ్రాండియర్ గా తెరకెక్కిన ‘డమరుకం’ చిత్రానికి కూడా ఈయనే సినిమాటోగ్రాఫర్. ఇప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గ్రాఫిక్స్ విజువల్ వండర్ ‘విశ్వంభర’ కి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. కొంత ప్యాచ్ వర్క్ మినహా, సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈయన ‘వదలా’ అనే చిన్న సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసాడు.
Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!
నేడు ఈ చిత్రానికి సంబంధించినా గ్లింప్స్ లాంచ్ జరిగింది. అందుకోసం ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఈయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. రిపోర్టర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘గతంలో మీరు అంజి, డమరుకం లాంటి భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాలు తీశారు. గ్రాఫిక్స్ ని క్రియేట్ చేయడంలో సినిమాటోగ్రాఫర్ పాత్ర ఎంత ఉంటుంది ?’ అని అడగ్గా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘సినిమాటోగ్రాఫర్ కి గ్రాఫిక్స్ కి ఎలాంటి సంబంధం లేదు. మేము విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ కోరిన విధంగానే షాట్ మేకింగ్ చేస్తాము. సెట్స్ లోకి నేను అడుగుపెట్టిన వెంటనే డైరెక్టర్ ని అడిగేది ఏంటంటే , సీజీ టెక్నీషియన్ వచ్చాడా లేదా అంటాను. అతని అనుమతి లేకుండా నేను కెమెరా కూడా ఆన్ చెయ్యను. వాళ్ళు కోరుకున్న విధంగా షాట్స్ మేకింగ్ చేసి ఇస్తాము, గ్రాఫిక్స్ బాగా రాలేదంటే అది వాడి కర్మ’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఎంటి లైటింగ్ పెట్టాలో కూడా వాళ్ళని అడిగే చేస్తాము. ఒకవేళ మా వాళ్ళ గ్రాఫిక్స్ చెడిపోయింది అని వాళ్ళు అంటే , కచ్చితంగా అది అబద్దమే ‘ అంటూ చెప్పుకొచ్చాడు. ‘మీరు అప్పట్లో అంజి కి పని చేశారు, ఇప్పుడు విశ్వంభర లాంటి గ్రాఫిక్స్ చిత్రానికి కూడా పని చేశారు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమైనా గమనించారా ?’ అని రిపోర్టర్ అడిగిన ప్రశ్న కు చోటా సమాధానం చెప్తూ ‘అప్పుడు తల ఎత్తుకొని పని చేసాను, కానీ ఇప్పుడు తల దించుకొని పని చేస్తున్నాను. ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. సినిమా మీద 400 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్లి నేను చెప్పినట్టు నడవాలంటే కుదరదు ‘ అంటూ చెప్పుకొచ్చాడు చోట కె నాయుడు.
Chota K Naidu for my Question About VFX and Vishwambhara VFX
“ఒక సినిమా సక్సెస్/ఫెయిల్యూర్ తో కెమెరామెన్ కు సంబంధం లేదు…”#Vishwambhara pic.twitter.com/VUCtd5DOB9
— Journalist Nishant (@NishantOpinions) March 11, 2026