Homeక్రీడలుక్రికెట్‌Mohammad Amir trolls: ఓరేయ్ ’పాకీ అమీరూ‘.. ఇప్పుడు నీ తల ఎక్కడ పెట్టుకుంటావ్ రా..

Mohammad Amir trolls: ఓరేయ్ ’పాకీ అమీరూ‘.. ఇప్పుడు నీ తల ఎక్కడ పెట్టుకుంటావ్ రా..

Mohammad Amir trolls: సూపర్ 8 లో గెలిస్తేనే సెమీఫైనల్ అవకాశాలు ఉన్నచోట.. వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తద్వారా దర్జాగా సెమీ ఫైనల్ చేరుకుంది. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా పోటీ పడనుంది. కోల్ కతా వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ 97* పరుగులు చేశాడు. తద్వారా కష్టమైన లక్ష్యాన్ని సునాయాసం చేశాడు. […]

Mohammad Amir trolls: సూపర్ 8 లో గెలిస్తేనే సెమీఫైనల్ అవకాశాలు ఉన్నచోట.. వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తద్వారా దర్జాగా సెమీ ఫైనల్ చేరుకుంది. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా పోటీ పడనుంది.

కోల్ కతా వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ 97* పరుగులు చేశాడు. తద్వారా కష్టమైన లక్ష్యాన్ని సునాయాసం చేశాడు. దీంతో అతని మీద ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి ఆట అద్భుతంగా ఉందంటూ మాజీ ప్లేయర్లు.. విశ్లేషకులు కొనియాడుతున్నారు.. టీమిండియా సాధించిన విజయం నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ పెసర్ అమీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.

సూపర్ 8 మ్యాచ్ కు ముందు అమీర్ ఓ పాకిస్తాన్ స్పోర్ట్స్ ఛానల్ నిర్వహించిన డిబేట్ కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా ఓడిపోతుందని జోష్యం చెప్పాడు. వెస్టిండీస్ బౌలింగ్ ముందు టీం ఇండియా బ్యాటర్లు తేలిపోతారని స్పష్టం చేశాడు. టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో.. సెమి ఫైనల్ వెళ్లిన క్రమంలో అమీర్ మీద సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సూపర్ 8 లో పాకిస్తాన్ ఇప్పటికే ఎలిమినేట్ అయింది. వెస్టిండీస్ జట్టు మీద గెలిచిన టీం ఇండియా సెమి ఫైనల్ వెళ్లిపోయింది. దీంతో ట్విట్టర్లో అమీర్ మీద విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: టీమిండియాను గెలిపించినా.. సంజు, తిలక్ వర్మకు ఇంకా న్యాయం జరగలేదా!

” టీవీ షోలో అబద్దాలు చెబుతావా. ముందు నిన్ను జైల్లో వేయాలి. నీలాంటి పిక్సర్ ఇండియా గురించి మాట్లాడటమే పెద్ద తప్పు. పైగా నువ్వు ఇండియా ఓడిపోతుందని అన్నావు. సొంత మైదానంలో ఓడిపోవడానికి ఇండియా ఏమైనా పాకిస్తాన్ జట్టా? 2024లో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. ఆ విషయం మర్చిపోతున్నావా? పాకిస్తాన్ చివరిసారిగా ఐసీసీ మేజర్ టోర్నీ లో ఎప్పుడు ట్రోఫీ గెలిచిందో జర చెప్పగలవా.. నీలాంటి వారు కూడా ఇండియా గురించి మాట్లాడటం సరి కాదు. టీమిండియా ఇప్పుడు సెమీఫైనల్ వెళ్ళింది. నువ్వు ఓడిపోతావని చెప్పిన జట్టు ఈ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావ్” అంటూ అమీర్ ను ఉద్దేశించి నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper