https://oktelugu.com/

PAK vs BAN : బంగ్లాదేశ్ అన్నంత పనీ చేసింది.. పాపం పాకిస్తాన్.. స్వదేశంలో దాయాది జట్టు పరువు పోయింది

బంగ్లాదేశ్ జట్టు అన్నంతపనీ చేసింది.. స్వదేశంలో పాకిస్తాన్ జట్టు పరువు తీసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించింది. నిరసనలు, గొడవలు, అల్లర్లతో నరకం చూస్తున్న తమ దేశంలో.. సానుకూల దృక్పథాన్ని కలిగించే ప్రయత్నం చేసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 3, 2024 / 07:08 PM IST

    Bangladesh Won 2nd test

    Follow us on

    PAK vs BAN : పాకిస్తాన్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో బంగ్లాదేశ్ సొంతం చేసుకుంది. క్లీన్ స్వీప్ చేసి సరికొత్త ఘనతను తన పేరు మీద లిఖించుకుంది. పాకిస్తాన్ జట్టుపై తొలిసారిగా టెస్ట్ సిరీస్ గెలిచి సరికొత్త చరిత్రకు బంగ్లాదేశ్ తెర లేపింది.. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును మట్టికరిపించింది.. 185 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బంగ్లాదేశ్ 42/0 ఓవర్ నైట్ స్కోర్ తో ఐదో రోజు రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది.. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు 56 ఓవర్ల పాటు ఆడింది. నాలుగు వికెట్లను కోల్పోయింది. బంగ్లా ఓపెనర్లు జకీర్ హసన్(40), షాద్మాన్ ఇస్లామ్(24), నజ్ముల్ హొస్సేన్ శాంటో(38), మోమినుల్ హక్(34), ముష్ఫీకర్ రహీం (22*) షకీబ్ అల్ హసన్(21*) పరుగులు చేసి బంగ్లా విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. పాకిస్తాన్ బౌలర్లలో మీర్ హంజా, షాజాద్, అబ్రార్ అహ్మద్, అఘా సల్మాన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

    274 ఆల్ అవుట్

    అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 274 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. బంగ్లాదేశ్ తో ఇన్నింగ్స్ లో 26 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో.. లిటన్ దాస్(138), మెహది హసన్ మిరాజ్ (78) పటిష్టమైన ఇన్నింగ్స్ ఆడారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 262 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇక రెండో మైనింగ్ లో బంగ్లాదేశ్ పేస్ బౌలర్లు హసన్ 5/43, నహీద్ రాణా 4/44 రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ 172 రన్స్ కే ఆల్ అవుట్ అయింది. పాకిస్తాన్ రెండవ సల్మాన్ ఆఘా 47*, మహమ్మద్ రిజ్వాన్ 43 కనుక ఎదురు దాడి చేయకపోతే పాకిస్తాన్ ఆ మాత్రం కూడా స్కోర్ చేసి ఉండేది కాదు.. రెండవ ఇనింగ్స్ లో బంగ్లా బ్యాటర్లను కట్టడి చేయడంలో పాకిస్తాన్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.. ధారాళంగా పరుగులు ఇచ్చారు. దీంతో బంగ్లాదేశ్ విజయం సాధించింది..

    మరిన్ని విజయాలు సాధించాలి

    పాకిస్తాన్ జట్టుపై టెస్ట్ సిరీస్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడంతో బంగ్లాదేశ్ జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. స్ఫూర్తివంతమైన ఆట తీరు ప్రదర్శించారని బంగ్లా ఆటగాళ్లపై ఆ దేశ అభిమానులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. కల్లోల దేశంలో ఆటగాళ్ల ప్రదర్శన సానుకూల దృక్పథాన్ని పెంచిందని కొనియాడుతున్నారు. వచ్చే రోజుల్లోనూ మెరుగైన ఆట తీరు ప్రదర్శించి బంగ్లాదేశ్ కీర్తి ప్రతిష్టలను పెంచాలని ఆ దేశ అభిమానులు కోరుకుంటున్నారు.