https://oktelugu.com/

Naga Manikanta : మరో పల్లవి ప్రశాంత్ అయ్యేందుకు నాగ మణికంఠ ప్రయత్నాలు..ప్రతీసారి సానుభూతి వర్కౌట్ అవ్వదమ్మా!

హౌస్ లో అంత వినయంగా కనిపించిన పల్లవి ప్రశాంత్, బయటకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడో ప్రతీ ఒక్కరు చూసారు. ఇప్పుడు ప్రేక్షకులు కూడా నాగ మణికంఠ విషయం లో అదే చేస్తున్నారా?, ఎందుకంటే సోషల్ మీడియా పోలింగ్ ప్రకారం ఈ వారం నామినేషన్స్ లో ఉన్నటువంటి నాగ మణికంఠ అందరికంటే టాప్ ఓట్లతో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 3, 2024 / 07:14 PM IST

    Nagamaniaknta

    Follow us on

    Naga Manikanta : బిగ్ బాస్ సీజన్స్ లో కంటెస్టెంట్స్ అద్భుతంగా ఆడినవారికంటే ఎక్కువగా, సానుభూతి పొందిన కంటెస్టెంట్స్ విన్ అవుతూ రావడాన్ని ఇటీవల కాలంలో మనం చాలానే చూసాము. సీజన్ 2 లో కౌశల్ కి కూడా అలాగే జరిగింది. నాల్గవ వారంలోనే ఎలిమినేట్ అవ్వాల్సిన ఈయన, హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేయడంతో ఒక్కసారిగా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. చివరి వారం వరకు నిలిచి టైటిల్ గెలిచాడు. ఇక గత సీజన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రైతు బిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ మొదటి వారం నుండే ప్రేక్షకులు తనపై సానుభూతి చూపించే విధంగా హౌస్ లో ప్రవర్తించాడు. ఇతని సానుభూతి గేమ్ ని ప్రేక్షకులకు తెలిసేలా చేద్దామనుకున్న హౌస్ మేట్స్ , ఒక్కసారిగా అందరూ ప్రశాంత్ ని టార్గెట్ చేయడంతో, అతని పై సానుభూతి ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరింది.

    ఇక ఆయనకీ తోడుగా శివాజీ కూడా నిలబడడంతో పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇప్పుడు సీజన్ 8 లో కూడా నాగ మణికంఠ అలాంటి గేమ్ ఆడాలని చూస్తున్నాడా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇతని బ్యాక్ గ్రౌండ్ వింటే కరగని మనిషంటూ ఎవ్వరూ ఉండరు. చిన్నతనంలోనే నాన్న చనిపోయాడు, అమ్మ క్యాన్సర్ తో చనిపోయింది, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా దూరం పెట్టేసింది, ఇన్ని రకాల విషాద సంఘటనలు ఒక మనిషికి జరగడం దురదృష్టమే. కానీ అలాంటి సంఘటనలు ప్రతీ మనిషిలోనూ ఉంటాయి, వాటినే హైలైట్ చేస్తూ గేమ్ ఆడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కంటెస్టెంట్స్ ఆలోచించుకోవాలి. గత సీజన్ లో సానుభూతి విపరీతంగా పెరగడం వల్ల, రన్నర్ గా నిల్చిన అమర్ దీప్ కి ఎలాంటి సంఘటన ఎదురైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హౌస్ నుండి అడుగు బయట పెట్టగానే అతనిపై దాడి చేసారు. పల్లవి ప్రశాంత్ ని ఒక కంటెస్టెంట్ గా జనాలు చూడడం మానేసి, రైతు బిడ్డగా మాత్రమే చూసారు. అతన్ని తిడితే రైతులను తిట్టినట్టే, అతనిపై చెయ్యి వేస్తే సామాన్యుల మీద చెయ్యి వేసినట్టే అన్నట్టుగా జనాల్లోకి వెళ్ళింది.

    హౌస్ లో అంత వినయంగా కనిపించిన పల్లవి ప్రశాంత్, బయటకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడో ప్రతీ ఒక్కరు చూసారు. ఇప్పుడు ప్రేక్షకులు కూడా నాగ మణికంఠ విషయం లో అదే చేస్తున్నారా?, ఎందుకంటే సోషల్ మీడియా పోలింగ్ ప్రకారం ఈ వారం నామినేషన్స్ లో ఉన్నటువంటి నాగ మణికంఠ అందరికంటే టాప్ ఓట్లతో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. చూస్తుంటే ఇతనిపై జనాలు సానుభూతి చూపించడం మొదలు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఈ సానుభూతి గేమ్ ఎవరికీ మంచిది కాదు, దీనికి నాగార్జున ఈ వారం లోనే బ్రేక్ వేస్తాడా లేదా అనేది చూడాలి. కేవలం కంటెస్టెంట్ గేమ్ తీరుని బట్టే ఆడియన్స్ ఓట్లు వేస్తే న్యాయంగా ఉంటుంది, చూడాలి మరి నాగ మణికంఠ ఏ రేంజ్ కి వెళ్తాడు అనేది రాబోయే రోజుల్లో.