Ram Charan: మెగాస్టార్ చిరంజీవి సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేశాడు. దశాబ్దాల పాటు ఆయన టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఉన్నారు. ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ అయ్యాడు. చిరంజీవి వారసుడిగా ఆయన కుమారుడు రామ్ చరణ్ 2007లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిరుత రామ్ చరణ్ డెబ్యూ మూవీ. ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది.
రెండో మూవీ మగధీర తో రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ నమోదు చేశాడు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర అనేక రికార్డ్స్ బ్రేక్ చేసింది. మగధీర మూవీ పలు భాషల్లో రీమేక్ అయ్యింది. ధ్రువ, రంగస్థలం వంటి హిట్స్ రామ్ చరణ్ ఇమేజ్ పెంచాయి. రామ్ చరణ్ స్టార్ హీరోల లిస్ట్ లో చేరాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఎన్టీఆర్-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కింది.
ఇక రామ్ చరణ్ వ్యక్తిగత విషయాలు పరిశీలిస్తే… ఆయన అపోలో గ్రూప్ అధినేత కూతురు ఉపాసనను 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళైన వెంటనే ఈ దంపతులు ఒక ఒప్పందం చేసుకున్నారట. పదేళ్ల వరకు పిల్లలు వద్దు అనుకున్నారట. ఒప్పందానికి కట్టుబడి రామ్ చరణ్-ఉపాసన ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదు. ఈ క్రమంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా వీరు తమ ప్రామిస్ బ్రేక్ చేయలేదు.
గత ఏడాది ఉపాసన పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పేరు క్లిన్ కార అని పెట్టారు. క్లిన్ కార జననం అనంతరం మెగా ఫ్యామిలీకి అనే శుభాలు జరిగాయి. మరి రామ్ చరణ్ తల్లి సురేఖకు భయపడతారా? లేక భార్య ఉపాసనకు భయపడతారా? అనే సందేహం ఉంది. ఈ ప్రశ్న గతంలో రామ్ చరణ్ కి ఎదురైంది. రామ్ చరణ్ మాట్లాడుతూ.. నాన్న చిరంజీవి నాకు కొన్ని విషయాలు నేర్పారు. భార్యను గౌరవించాలి. మా ఇంట్లో మా అమ్మే బాస్. బాబాయ్ పవన్ కళ్యాణ్ కి కూడా ఆమెనే బాస్.
కాబట్టి నాన్న అడుగుజాడల్లో నడిచే వాడిగా నేను కూడా నా భార్య ఉపాసనను గౌరవిస్తాను, అని అన్నాడు. ఆయన మాటల ప్రకారం.. చిరంజీవి భార్య సురేఖకు భయపడితే, రామ్ చరణ్ తన భార్య ఉపాసనకు భయపడుతున్నాడు. అదన్నమాట మేటర్. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ విడుదలకు సిద్ధం అవుతుంది. డిసెంబర్ 24న విడుదల కానుందని సమాచారం. అనంతరం ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక చిత్రం చేస్తున్నారు.