Homeక్రీడలుక్రికెట్‌Nitish Kumar Reddy: నితీష్ కుమార్ రెడ్డికి ఏమైంది.. ఈరోజు ఎందుకు మ్యాచ్ ఆడలేదు

Nitish Kumar Reddy: నితీష్ కుమార్ రెడ్డికి ఏమైంది.. ఈరోజు ఎందుకు మ్యాచ్ ఆడలేదు

Nitish Kumar Reddy: ఈ సీజన్లో ఇప్పటివరకు భీకరమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్న హైదరాబాద్ జట్టు.. తొలిసారిగా తేలిపోయింది. అంతగా ఫామ్ లో లేని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్ల ముందు తలవంచింది.. ఓపెనర్లు అభిషేక్ శర్మ (15) అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. హెడ్ (61), ఇషాన్ కిషన్ (42) పర్వాలేదనిపించారు. మిగతా ప్లేయర్లు క్లాసెన్(11), రవిచంద్రన్ (4), అనికేత్ వర్మ (6), సలీల్ అరోరా (2), కమిన్స్(10), శివాంగ్ కుమార్ (1) దారుణంగా విఫలమయ్యారు.

ఈ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ ఆటగాడు, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆడలేదు. అతడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఈ మ్యాచ్లో అతడికి హైదరాబాద్ మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. దీంతో అతడు ఈ మ్యాచ్ కి దూరమయ్యాడు. అతడు లేని చోటు ఈ మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది. అతడు గనుక ఉండి ఉంటే ఎంతో కొంత ఇన్నింగ్స్ ఆడేవాడు. అది హైదరాబాద్ జట్టుకు హెల్ప్ అయ్యేది. కానీ అతడు అనారోగ్యం వల్ల ఆడలేక పోవడంతో.. హైదరాబాద్ జట్టు ఇబ్బంది పడింది.

ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు దూకుడుగా బ్యాటింగ్ చేసింది.. మిడిల్ ఆర్డర్ అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. మిగతా ప్లేయర్లు సత్తా చూపించారు. కానీ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ప్లేయర్లు ఏమాత్రం దూకుడు కొనసాగించలేకపోయారు.. వేగంగా ఆడే క్రమంలో వికెట్లు పడేసుకున్నారు. దీంతో 200 పైగా స్కోర్ నమోదు అవుతుంది అనుకుంటున్న క్రమంలో.. కేవలం 165 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. ఇది హైదరాబాద్ జట్టు అభిమానులకు తీవ్రమైన నిర్వేదాన్ని కలిగించింది. హైదరాబాద్ ఆటగాళ్లు ఇలా ఆడతారని కలలో కూడా ఊహించలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ జట్టులో హెడ్, ఇషాన్ కిషన్ మినహా మిగతావారు అంతగా ఆడలేదు.. కోల్ కతా బౌలర్ల దూకుడు ముందు హైదరాబాద్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బంతి నేరుగా దూసుకురావడంతో ఎదుర్కోలేక వికెట్లు సమర్పించుకున్నారు. ఒకానొక దశలో 117/3 వద్ద ఉన్న హైదరాబాద్ జట్టు.. చివరి 7 వికెట్లను 48 పరుగుల వ్యవధి లోనే కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి మూడు, శివాంగ్ రెండు, సునీల్ రెండు వికెట్లు పడగొట్టారు. వైభవ్, అనుకూల్, గ్రీన్ తలా ఒక వికెట్ సాధించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular