New Zealand Vs Sri Lanka: టెస్ట్ క్రికెట్.. ఈ కాలం ప్రేక్షకులకు ఈ ఫార్మాట్ పెద్దగా ఎక్కదు. ఐదు రోజులపాటు మ్యాచ్ జరుగుతుంది.. బ్యాటర్లు దూకుడుగా కంటే నిదానంగా బ్యాటింగ్ చేస్తారు. బౌలర్లు తమ వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ప్రేక్షకులకు కిక్ ఎక్కించే పరిణామాలు టెస్ట్ క్రికెట్లో అంతగా చోటు చేసుకోవు. పైగా గంటల తరబడి మ్యాచ్ లు సాగుతుంటాయి కాబట్టి.. ఒకరకంగా టెస్ట్ క్రికెట్ అంటే చాలామంది బోరింగ్ అని భావిస్తుంటారు.
అప్పుడప్పుడు టెస్ట్ క్రికెట్లో సంచలనాలు కూడా నమోదు అవుతుంటాయి. అరుదుగా మాత్రమే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. కాకపోతే టెస్ట్ క్రికెట్లో బ్యాటర్ల జోరుకంటే.. బౌలర్ల ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. టెస్ట్ క్రికెట్లో మ్యాచ్ విన్నర్లుగా బౌలర్లే నిలుస్తుంటారు. టెస్ట్ క్రికెట్లో సంచలనాలు నమోదయ్యే తీరు తక్కువగానే ఉన్నప్పటికీ.. అవి చోటు చేసుకుంటే మాత్రం టీ20 కంటే ఎక్కువ ఆనందాన్ని ప్రేక్షకులకు అందిస్తాయి. అటువంటి మ్యాచ్ టెస్ట్ క్రికెట్లో ఒకటి చోటుచేసుకుంది. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఇది జరిగినప్పటికీ.. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ వీడియో కనిపిస్తే.. లక్షల్లో వ్యూస్ లభిస్తుంటాయి.
2023లో శ్రీలంక, న్యూజిలాండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ముందు శ్రీలంక 285 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనిని చేదించడానికి రంగంలోకి దిగిన న్యూజిలాండ్ తో చివరి వరకు పోరాటం చేసింది. అటు శ్రీలంక బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ వేశారు. న్యూజిలాండ్ బ్యాటర్ విలియంసన్ అద్భుతమైన సెంచరీ చేశాడు.
మ్యాచ్ చివరి వరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. చివరి బంతికి ఒక పరుగు చేయాల్సిన సందర్భంలో.. ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఆ దశలో శ్రీలంక బౌలర్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ఆ బంతి ని కొట్టడానికి విలియంసన్ శతవిధాలుగా ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ బంతి బ్యాట్ కు తగలలేదు. అయినప్పటికీ బై రూపంలో పరుగు తీశాడు విలియంసన్. రనౌట్ చేయడానికి శ్రీలంక ఫీల్డర్లు ప్రయత్నించారు. అయితే అప్పటికే క్రీజ్ లోకి న్యూజిలాండ్ బ్యాటర్ రావడంతో శ్రీలంక జట్టుకు ఓటమి తప్పలేదు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ మ్యాచ్ ఎప్పటికీ నిలిచిపోతుంది.
Day 5, last ball of the test match, New Zealand need one run to win the match, Sri Lanka needed to bowl a dot ball to tie the game. What a drama. #NZVSL pic.twitter.com/TqPfp2jrPN
— Nibraz Ramzan (@nibraz88cricket) December 24, 2025