Dandora Movie OTT: క్రిస్మస్ కానుకగా నేడు నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో శివాజీ(Actor Sivaji), నవదీప్ వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించిన ‘దండోరా'(Dandora Movie) చిత్రానికి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు విడుదలకు ముందు నుండే ఆడియన్స్ లో మంచి హైప్ ఉండేది. ఎందుకంటే టీజర్, ట్రైలర్ వంటివి సమాజం లో జరుగుతున్న అంశాలకు అద్దం పట్టేలా ఉండడం తో కచ్చితంగా ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద రేంజ్ కి వెళ్తుంది అనే ఫీలింగ్ ని కలిగించింది. కుల పిచ్చి తో సమాజం లో అకృత్యాలు చేసే వాళ్ళు ఈ కాలం లో కూడా ఉన్నారు అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి మనుషుల కారణంగా జరిగే సంఘటనలు ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆడియన్స్ కి ఈ అంశాలు బాగా కనెక్ట్ అవ్వడం తో ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి.
పైగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ హీరోయిన్ దుస్తులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు వివాదాలకు దారి తియ్యడం వల్ల బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ కూడా ఈ చిత్రానికి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఇలాంటి సినిమాలు ఓటీటీ కి విడుదలకు ముందు అమ్ముడుపోవడం అనేది చాలా పెద్ద టాస్క్ అయ్యింది ఇప్పుడు. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలే విడుదలకు ముందు ఓటీటీ రైట్స్ పూర్తి స్థాయిలో అమ్ముడుపోని రోజులివి. సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యాకనే మీరు అడిగినంత డబ్బులు ఇస్తామని అంటున్నారు. అలాంటిది ఈ చిత్రం విడుదలైన రోజే అమెజాన్ ప్రైమ్ సంస్థ మంచి ఫ్యాన్సీ రేట్ కి ఈ చిత్రాన్ని కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి మూడవ వారం లో కానీ, లేదా జనవరి నెలాఖరున కానీ ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ ని తెచ్చుకున్న ఈ చిత్రం, ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.