https://oktelugu.com/

New zealand vs Australia 1st test : గ్రీన్ నిలబడ్డాడు.. ఆసీస్ ను నిలబెట్టాడు!

ఒకానొక దశలో ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆస్ట్రేలియా జట్టును కామెరూన్ గ్రీన్ ఆదుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ దీటుగా పరుగులు చేశాడు.

Written By:
  • NARESH
  • , Updated On : February 29, 2024 / 06:16 PM IST
    Follow us on

    New zealand vs Australia 1st test : రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ తొలి టెస్ట్ సెంచరీ సాధించాడు. మిగతా ఆటగాళ్ళు విఫలమయినప్పటికీ గ్రీన్ ఒక్కడే న్యూజి లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. 155 బంతుల్లో 16 ఫోర్ల సహాయంతో 103 పరుగులు చేసి నాట్ ఔట్ గా నిలిచాడు.

    టాస్ గెలిచి న్యూజి లాండ్ కెప్టెన్ సౌతీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అతడి నిర్ణయం సరైందని కివీస్ బౌలర్లు నిరూపించారు. స్టీవెన్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా కంగారు జట్టు తరఫున ఓపెనర్లు గా దిగారు. వీరు తొలి వికెట్ కు 61 పరుగులు జోడించారు. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ (31) ను హెన్రీ పెవిలియన్ పంపించాడు. లబూషేన్(1) కుగెల్ జిన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో కామెరూన్ గ్రీన్, ఉస్మాన్ ఖవాజా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాలకి ఎత్తుకున్నారు.. అయితే ఈసారి కూడా హెన్రీ పదునైన బంతితో ఉస్మాన్ ఖవాజా(33) ఔట్ చేశాడు.. ట్రావిస్ హెడ్ ఒక్క పరుగు చేసి ఓరూర్క్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.

    89 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టును గ్రీన్, మార్ష్ గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. ఐదో వికెట్ కు వీరిద్దరూ 67 పరుగులు జోడించారు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 156 పరుగులు. ఈ క్రమంలో మరోసారి హెన్రీ మ్యాజిక్ చేసి మార్ష్(40) ను ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన క్యారీ, స్టార్క్ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరుకున్నారు. కమిన్స్(16), లయన్(5) నిరాశపరిచారు. అయినప్పటికీ గ్రీన్.. న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ తన తొలి టెస్ట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది..గ్రీన్ (103), హజిల్ వుడ్( 0 )తో క్రీజ్ లో ఉన్నారు.

    ఒకానొక దశలో ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆస్ట్రేలియా జట్టును కామెరూన్ గ్రీన్ ఆదుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ దీటుగా పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా జట్టులో మార్ష్(40), ఖవాజా (33) స్మిత్ (31) మాత్రమే రాణించారు. బౌన్సీ మైదానం కావడంతో న్యూజిలాండ్ బౌలర్లు సంధించే బంతులను ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ నాలుగు వికెట్లు తీశాడు. ఓరూర్క్, కుగెల్ జిన్ తలా రెండు, రచిన్ రవీంద్ర ఒక వికెట్ తీశారు..